Kishan Reddy: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి
ఎన్డీయే ప్రభుత్వం ప్రధాని మోదీ మంత్రి వర్గంలో మరోసారి చోటుదక్కడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపు తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఎన్డీయే(NDA govt) ప్రభుత్వం ప్రధాని మోదీ మంత్రి వర్గంలో(Prime Minister Modi’s cabinet) మరోసారి చోటుదక్కడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపు తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీ లో మీడియాతో మాట్లాడారు తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మంత్రి వర్గం లో మంత్రిగా పనిచేశానని, ప్రస్తుతం రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర క్యా బినెట్‌లో ఎలాంటి శాఖ ఇచ్చిన స మర్థవంతంగా పనిచే స్తానని స్పష్టం చేశారు. తనను ఎంపీగా గెలిపించి న సికింద్రాబాద్ ప్రజలకు ధన్యవా దాలు తెలుపుతున్నానన్నారు.
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రెండు తెలు గు రాష్ట్రాల తెలంగాణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గతంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చానన్నారు. కొందరు రాజకీయంగా తనను విభేదించి కామెంట్లు చేసే మూర్ఖుల ను అసలు పట్టించుకోనన్నారు. రీజ నల్ రింగ్ రోడ్డు,(Regional Ring Road), టెక్ట్స్‌టైల్ పార్కు(Textile Park), రైల్వే ప్రాజెక్టులు(Railway Projects), కేంద్ర సంస్థలు( Central Institutions) తీసుకొచ్చానని కిషన్ రెడ్డి వివరిం చారు. రాష్ట్ర బిజెపి లో సంస్థాగత మార్పులు…. బీజేపీలో సంస్థాగ త మార్పులు త్వరలో ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించా రు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా కొనసా గించారని, ప్రస్తుతం ఆ పదవీ కాలం పూర్తయిందన్నారు. అధ్యక్ష మార్పు అనివార్యమని పేర్కొన్నా రు. తెలం గాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తనకు మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవిని అప్ప గించారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కాబట్టి తెలంగాణ సహా ఇంకా అనే క రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష మార్పులు ఉంటాయని వెల్లడించారు. కేబినెట్ కసరత్తు పూర్తయిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులపై త్వర లోనే కసరత్తు చేసి కొత్తవారిని నియమిస్తారని కిషన్ రెడ్డి వెల్లడిం చారు.
Telugu states development is main