Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Temperature: మెట్రోనగరాల్లో మంటలు

దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో వేసవి తీవ్రత గణనీయం గా పెరుగుతుంది. ఆ నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్ గా మారడంతో పాటు తేమ శాతం ఎక్కువ కావ డమే ఇందుకు కారణమని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎసఈ) అధ్యయ నంలో వాస్తవాలు వెల్లడిస్తున్నా యి.

మెగా సిటీల్లో గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాత్రివేళల్లోనూ చల్లబడని వాతావరణంతో ఆపసోపాలు
కాంక్రీట్ నిర్మాణాలు పెరిగి పచ్చద నం పటాపంచలు
గడిచిన ఇరవై ఏళ్లలో 24 శాతం పెరిగిన నిర్మాణ ప్రాంతాలు
ఆoదోళన కల్గిస్తున్న ఢిల్లీకి చెందిన సీఎస్ఈ సంస్ధ అధ్యయనాలు

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో(Metro cities)వేసవి తీవ్రత గణనీయం గా పెరుగుతుంది. ఆ నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్ గా(Concrete Jungle)మారడంతో పాటు తేమ శాతం ఎక్కువ కావ డమే ఇందుకు కారణమని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎసఈ) అధ్యయ నంలో వాస్తవాలు వెల్లడిస్తున్నా యి. దీoతో ఆయా నగరాల్లో రాత్రి పూట కూడా వాతావరణం చల్లబ డలేని పరిస్థితి నెలకొందని సీఎసఈ సంస్థ తన అధ్యయన నివేదికను “డీకోడింగ్ ది అర్బన్ హీట్ స్ట్రెస్ ఏమాంగ్ ఇండియన్ సిటీస్” అనే పేరుతో మంగళవారం విడుదల చేసింది.దేశంలోని ఆరు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంభై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చైన్నై నగరాల్లో 2001 నుంచి 2024 నడుమ వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసింది.

ఈ ఆరు నగరాలను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఇవన్నీ కూడా విభి న్న వాతావరణ మండలాల్లో (క్లైమె ట్తోన్స్) ఉండడమే కారణం. ఆ నివేదిక ప్రకారం రాత్రి వేళల్లో ఈ మెగా సిటీలు చల్లబడటం లేదు. 2001-2010 మధ్య కాలంలో వేసవిలో భూఉపరితల ఉష్ణోగ్రతలు పగటిపూటతో పోలిస్తే రాత్రివేళకు 6.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 13.2 డిగ్రీల మేర తగ్గేవని ఆ స్టడీ పేర్కొం ది. 2014-23 నడుమ ఆ తేడా 6.2 డిగ్రీల నుంచి 11.5 డిగ్రీలకు తగ్గినట్టు వెల్లడించింది. హైదరాబా ద్(Hyderabad) లో 2001- 10 నడుమ పగటి, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా 13 డిగ్రీలుగా ఉంటే 2014-23 నడుమ ఆ తేడా 11.5 డిగ్రీలకు పడిపోయి నట్టు తెలిపింది.

ఇక, గ్రీన్ వర్ ఏరి యా(Green var eriya)విషయానికి వస్తే 2003 నుంచి 2023 నడుమ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పచ్చదనం పెరగ్గా, ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో పచ్చదనం తగ్గినట్టు అధ్యయనంలో తేలింది.ఢిల్లీలో 2003లో 32.6 శాతంగా ఉన్న గ్రీన్కవర్ ఏరియా 2022 నాటికి 44.2 శాతానికి పెరిగింది. అక్కడ నిర్మాణ ప్రాంతం కూడా 2003లో 31.4్న నుంచి 2022 లో 38.2 శాతానికి పెరిగింది.ముంబైలో నిర్మా ణ ప్రాంతం 2003లో 38.4్న నుంచి 2023లో 52.1 శాతానికి పెరగ్గా పచ్చదనం 35.8్న నుంచి 30.2 శాతానికి తగ్గింది.కోల్ కత్తాలో నిర్మాణ ప్రాంతం 2001లో 70 శాతం నుంచి 2023లో 80.1 శాతానికి పెరగ్గా పచ్చదనం 15.20 నుంచి 14.5 శాతానికి తగ్గింది. హైదరాబాద్ లో నిర్మాణప్రాంతం 2003లో 20.60 నుంచి 2023 లో 44 శాతానికి, పచ్చదనం 8.90 నుంచి 26.5 శాతానికి పెరిగాయి.

బెంగళూరులో(Bangalore) నిర్మాణప్రాంతం 200 3లో 37.5 నుంచి 2023 లో 71.5 శాతానికి, పచ్చదనం 18.8 నుంచి 26.4 శాతానికి పెరిగాయి.చెన్నైలో నిర్మాణప్రాంతం 30.70 నుంచి 73.5 శాతానికి పెరగ్గా పచ్చదనం మాత్రం 34 శాతం నుంచి 20.3 శాతానికి తగ్గింది.

హైదరాబాద్ లో పరిస్థితి ఇలా….

2001 – 10 నుంచి 2014-23 మధ్య కాలంలో వేసవిలో హైదరా బాద్ నగరంలో వాతావర ణంలో తేమ (హ్యుమిడిటీ లెవల్స్) శాతం పది శాతం మేరకు పెరిగింది. అలాగే నగరంలో వేగంగా నిర్మాణ ప్రాంతం పెరుగుతూ వస్తోంది. దీనికి పట్టణ ఉష్ణోగ్రతలు పెరగడానికి మధ్య ప్రత్య క్ష సంబంధం ఉంది. వేసవిలో పగటివేళల్లో చుట్టుపక్కల ప్రాం తాల కంటే నగరంలో 0.7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కానీ రాత్రిపూట మాత్రం దాని పరిసర ప్రాంతాలకంటే సగటున 1.9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

Temperatures significantly Metro cities