Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Terror attack: కాశ్మీర్ లో ఉగ్రదాడి

జమ్మూక శ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు.

యాత్రికుల బస్సుపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు
బస్సు లోయలో పడి 10 మంది మృతి 33 మందికి గాయాలు
ప్రజా దీవెన, జమ్మూ: జమ్మూక శ్మీర్‌లో ఉగ్రవాదులు(Terror attack in Kashmir) దారుణానికి పాల్పడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. రియాసీ జిల్లాలోని శివ్‌ ఖోడీ ఆల యాన్ని సందర్శించుకున్న యాత్రి కులు(Tourist) కాట్రాకు వెళ్తుండగా ఆదివా రం సాయంత్రం 6 గంటల సమ యంలో పోని ప్రాంతంలోని తెర్యాత్‌ గామ్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఫలితంగా బస్సు లోయ(Valley) లో పడిపోయింది. ఈ ఘటనలో పదిమంది యాత్రికులు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోగా 33 మంది గాయపడ్డారు. బాధితులందరూ ఇతర ప్రాంతాలకు చెందినవారేనని పోలీసులు వెల్లడించారు.

కాగా, ఎత్తైన ప్రాంతంలో నక్కిన ఉగ్రవా దులు కాల్పులు జరపడం బస్సు లోయలోకి దొర్లుకుంటూ పడిపోవ డం క్షణాల్లోనే జరిగిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే చేరుకుని స్థాని కులతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు. రాత్రి 8 గంటల సమ యానికి గాయపడ్డ యాత్రికులంద ర్నీ బయటకు తీసుకొచ్చారు. రియా సీ, తెర్యాత్‌, జమ్మూలోని ఆస్పత్రు లకు తరలించారు. పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌(CRPF) రంగంలో దిగి ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టాయి. కశ్మీర్‌లోని రాజౌరీ, పూం ఛ్‌ జిల్లాల్లో ఉగ్రవాదం తీవ్రంగా ఉం టుంది.

రియాసీలో ఆ ప్రభావం కని పించదు. అలాంటిచోట దాడి జరగ డంతో భద్రత బలగాలు అప్రమ త్తమయ్యాయి. కాగా, ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ పరిస్థితిని సమీక్షించారు.దాడికి బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని కేంద్ర మంత్రి అమిత్‌ షా(Central Minister Amit shah) హెచ్చరించారు. ప్రధాని మోదీ, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో, పలు దేశాల అధిపతులు వచ్చిన సందర్భంలో ఈ దాడి జరగడం దారుణమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో శాంతిభద్రతలు ఆందోళనకర రీతి లో ఉన్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

Terror attack in Kashmir