Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Terrorist Groups Crushed : ఊడ్చుకుపోయిన ఉగ్రమూకలు

–తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్లో 90మంది నాశనం

–అధికారికంగా ప్రకటించిన త్రివిధ దళాల ప్రకటన

–దేశ వ్యాప్తంగా సర్వత్రా పెల్లుబి కుతోన్న హర్షాతిరేకాలు

–అత్యవసర ప్రధాని మోదీ విదేశీ పర్యటన

Terrorist Groups Crushed :ప్రజా దీవెన, జమ్మూ కశ్మీర్: ప్రపం చ వ్యాప్తంగా సంచలనం సృష్టించి న పహల్గామ్ దాడి జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత భారతదేశం ప్ర తీకారం తీర్చుకుని విజయ దుందు భి మోగించింది. బుధవారం తెల్ల వారు జామున 1:44 గంటల ప్రాం తంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌లో పేరుతో పాకిస్తాన్, ఆక్ర మిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవా ద స్థావరాలను ధ్వంసం చేసింది. బ హావల్‌పూర్‌లోని మసూద్ అజార్ రహస్య స్థావరం సహా తొమ్మిది ఉగ్ర వాద స్థావరాలపై భారతదేశం బాం బు దాడి చేసింది. ఈ క్షిపణి దాడి లో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ ఐ) మద్దతు ఉన్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హి జ్బుల్ ముజాహిదీన్ వంటి భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థల స్థావరా లన్నీ ధ్వంసమయ్యాయని సమా చారం. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక శిక్షణా శిబిరాలు (మ ర్కజ్) లాంచ్ ప్యాడ్‌లు ప్రస్తుతం పాక్ సైనిక స్థావరాలకు సమీపంలో నడుస్తున్నాయి. భారతదేశంకు వ్య తిరేకంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను న డుపుతున్న 9 స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వర్గాలు నిర్ధా రించాయి. ఈ 9 ఉగ్రవాద స్థావరా ల గురించి సవివరంగా తెలుసుకు నే ప్రయత్నం చేద్దాం.

1.మర్కజ్ సుభాన్ అల్లా, బహవ ల్పూర్… ఈ ఉగ్రవాద స్థావరం 20 15 నుండి చురుకుగా ఉంది. ఇది జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాల యం అని కూడా చెబుతారు. ఈ రహస్య స్థావరం 2019 పుల్వామా దాడితో సహా జెఎం ఉగ్రవాద ప్రణా ళికలతో ముడిపడి ఉంది. జెఎం చీ ఫ్ మౌలానా మసూద్ అజార్, ము ఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమ్మర్, మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మర్కజ్‌లో నివసించారు. ఇక్కడి నుండే మసూద్ అజార్ భా రత్‌పై వ్యతిరేకంగా ప్రచారాలు చే స్తూ యువత ఇస్లామిక్ జిహాద్‌లో చేరాలని విజ్ఞప్తి చేస్తూ అనేక ప్రసం గాలు చేసేవాడు. మర్కజ్ సుభాన్ అల్లాహ్ వద్ద తన కార్యకర్తలకు జె ఇఎం క్రమం తప్పకుండా ఆయుధా లు, శారీరక, మతపరమైన శిక్షణ ను అందించింది.

2. మర్కజ్ తైబా, మురిడ్కే… 2000లో స్థాపించబడిన మర్కజ్ తైబా, పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని నంగల్ సహదాన్ మురిడ్కేలో ఉ న్న ‘అల్మా మేటర్’, ఎల్‌ఇటి అతి పెద్ద శిక్షణా కేంద్రం. దీనిలో ఆయు ధాలు, శారీరక శిక్షణా సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1000 మంది విద్యార్థులు ఈ మర్కజ్‌లో చేరుతారని తెలుస్తోంది. ప్రతి సంవ త్సరం లష్కర్ కోసం ఉగ్రవాద సం స్థలను సిద్ధం చేస్తుంది. మర్కజ్ తై బా కాంప్లెక్స్ లోపల మసీదు, అతి థి గృహం నిర్మాణానికి ఒసామా బి న్ లాడెన్ రూ. 10 మిలియన్లు ఆర్థి క సహాయం చేశాడు.

3.సర్జల్/తెహ్రా కలాన్ పాకిస్తా న్‌లోని పంజాబ్‌లో నరోవాల్ జి ల్లాలోని షకర్‌గఢ్ తహసీల్‌లో ఉన్న ఈ స్థావరం, జమ్మూ కాశ్మీర్‌లోకి ఉ గ్రవాదుల చొరబాటుకు జైష్-ఎ-మొ హమ్మద్ (జెఎం) ప్రధాన ప్రయోగ కేంద్రం. జెఎం ఉగ్రవాదులు మహ్మ ద్ అద్నాన్ అలీ అలియాస్ డాక్టర్, కాషిఫ్ జాన్ ఆ ప్రదేశాన్ని క్రమం త ప్పకుండా సందర్శించేవారు.

4.మహ్మూనా జోయా సెంటర్, సియాల్‌కోట్: హిజ్బుల్ ముజా హిదీన్ (HM) మహ్మూనా జోయా ఉగ్రవాద స్థావరం భుట్టా కోట్లి ప్రభు త్వ కేంద్రంలో ఉంది. దీనిని హిజ్బు ల్ ముజాహిదీన్ క్యాడర్లను జ మ్మూ ప్రాంతంలోకి చొరబడటాని కి ఉపయోగిస్తారు.
5.మర్కజ్ అహ్లే హదీత్ బ ర్నాలా: బర్నాలా నగర శివార్లలో కోటే జమీల్ రోడ్డులో ఉన్న భీంబర్, జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్‌ఇటి ప్రధా న శిక్షణా కేంద్రం. పూంచ్- రాజౌరి -రియాసి సెక్టార్‌కు ఎల్‌ఇటి ఉగ్రవా దులను ఆయుధాలను పంపడానికి ఉపయోగించేవారు.

6.మర్కజ్ అబ్బాస్, కోట్లి… ఇది పాకిస్తాన్‌లోని కోట్లిలో ఉన్న జెఇఎమ్ ముఖ్యమైన ఉగ్రవాద స్థావరం. జేఈఎం టాప్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్ సన్ని హితుడు హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఖారీ జర్రార్ ఈ మ ర్కజ్‌కి నాయకత్వం వహిస్తున్నా రు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేయడం లో, అమలు చేయడంలో ఖారీ జ ర్రార్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.

7.మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి ఇది హిజ్బుల్ ముజాహిదీన్ పురాతన శిక్షణా కేంద్రం. ఇది దాదా పు 150-200 మంది హిజ్బుల్ ము జాహిదీన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇ స్తుంది.

8. షావై నల్లా క్యాంప్, ముజఫ రాబాద్: ఆక్రమిత కాశ్మీర్‌లోని చె లబుండి వంతెన సమీపంలో ఉన్న ఈ ఉగ్రవాద స్థావరం లష్కర్ అ త్యంత ముఖ్యమైన శిబిరాలలో ఒ కటి. అజ్మల్ కసబ్ సహా 26/11 ముంబైలో దాడి చేసిన ఉగ్రవాదు లు ఈ శిబిరంలోనే ఉగ్రవాద శిక్షణ పొందారు. ఈ శిబిరం ఎల్‌ఇటి కా ర్యకర్తల నియామకం, నమోదు, శి క్షణ కోసం ఉపయోగిస్తారు. ఇది 2 000ల సంవత్సరం నుండి నడు స్తోంది.

9. మర్కజ్ సయ్యద్నాబి లా ల్: ముజఫరాబాద్‌లోని ఎర్ర కోట ఎదురుగా ఉన్న ఇది ఆక్రమిత కాశ్మీర్‌లోని జైష్ ప్రధాన కేంద్రం. ఈ స్థావరాన్ని ఉగ్రవాదులు జమ్మూ కా శ్మీర్‌లోకి ప్రవేశించే ముందు వారికి రవాణా శిబిరంగా ఉపయోగిస్తారు.

భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిం ధూర్‌ను భారత సైన్యం, నావికాద ళం, వైమానిక దళం నిర్వహించా యి. అదే సమయంలో ప్రధా నమం త్రి నరేంద్ర మోడీ రాత్రంతా ఆపరేష న్ సింధూర్‌ను నిరంతరం పర్యవే క్షించారు. ఈ దాడిలో 9 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నాశనం అ య్యాయని సమాచారం.

ప్రధాని మోదీ విదేశీ పర్యటన రద్దు…. ‘ఆపరేషన్ సింధూర్’ నేప థ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణ యం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు దేశాల పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. క్రొయే షియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను ఆయన రద్దు చేసుకు న్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.