Parliament elections: లోక్ సభ మూడో దశ ప్రశాంతం
లోక్‌సభ మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాం తంగా ముగిసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 93 పార్లమెం టు స్థానాలలో మూడో దశ పోలింగ్ జరిగింది.
11 రాష్ట్రాలు, యూటీల్లోని 93 లోక్‌సభ స్థానాలలో ఎన్నికలు
ఈవీఎంల్లో 1331 మంది
అభ్యర్థుల భవితవ్యం
రాత్రి 8 గంటల వరకూ 61.45%
పోలింగ్ నమోదు
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్‌సభ మూడో దశ ఎన్నికల పోలింగ్(Third phase lok sabha election polling) ప్రశాం తంగా ముగిసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 93 పార్లమెం టు స్థానాలలో మూడో దశ పోలింగ్(Third phase polling)) జరిగింది. చెదురుమదురు ఘటన లు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి ఎనిమిది గంటల వరకు 61.45శాతం పోలింగ్ నమో దైనట్లు వెల్లడించింది. ఇప్పటి వర కు జరిగిన మూడు దశల ఎన్నిక లతో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 283 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయినట్లు ప్రకటించింది.
మూడో దశలో గుజ రాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అసోం, పశ్చిమబెంగాల్, బిహార్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, గోవా, ఛత్తీస్‌గఢ్‌లోని స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇదే దశలో జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్, రాజౌరీ స్థానానికి పోలింగ్ జరగాల్సి ఉండగా ఈసీ ఆరో దశకు రీషెడ్యూ ల్ చేసింది. సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో అక్కడ పోలింగ్ జరగ లేదు.
మూడో దశలో 1331 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలి చారు. 23 దేశాలకు చెందిన 75 మంది ప్రతినిధులు ఆరు రాష్ట్రాల లోని వివిధ పోలింగ్(Polling)స్టేషన్లను సందర్శించి ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించారు. మొత్తం ఏడు దశల్లో 543 లోక్‌సభ(Lok sabha elections) స్థానా లకు ఎన్నికలు జరుగుతున్న సంగ తి తెలిసిందే. తదుపరి నాలుగో దశలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ సీట్లు సహా 96 స్థానాలకు 13న పోలింగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీకీ ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.
Third phase lok sabha election polling