Train Accident : ప్రజా దీవెన, ముంబై: మహారాష్ట్ర లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది పైగా దుర్మరణం పాలైనట్లు సమాచారం.మహారాష్ట్రలోని జల గావ్ జిల్లాలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగడంతో రైలు నుంచి భయంతో ఒక్కసారిగా ప్రయాణికులు బయటికి దూక డంతో.
ఈ ప్రమాదం సంభవిం చింది. రైలులో మంటలు చెల రేగ డంతో ఎక్కడ ప్రాణాల మీదికి వస్తుందో అన్న ఆత్రుతలో రైలు నుంచి పక్కకు దూకుతున్న సమ యంలోనే పక్క ట్రాకుపై అప్పుడే ప్రయాణిస్తున్న మరో రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో 20 మంది మరణించినట్లు సమాచారం. మృ తుల సంఖ్య మరింత పెరిగే అవ కాశం ఉందని రైల్వే పోలీసులు చెబుతున్నారు.
Train accident in maharashtra pic.twitter.com/IZjTRulYpo
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 22, 2025