Triveni Sangam: దేశ సైద్ధాంతిక సంగమ క్షేత్రం కన్యాకుమారి సాగరాల సంగమం
కన్యాకుమా రి సాగరాల సంగమ క్షేత్రమే కాకుం డా సైద్ధాంతిక సంగమ క్షేత్రంగా విరా జిల్లుతోందని ప్రధాని మోదీ పేర్కొ న్నారు.
ఆ గడ్డ సాగరాల సంగమ క్షేత్రమే కాకుండా దేశ సైద్ధాంతిక సంగమ క్షేత్రంగా విరాజిల్లుతోంది
మన సంస్కరణలు వికసిత్ భార త్ లక్ష్యసాధనకనుగుణంగా ఉండా లి
యువతే మనకు బలం ప్రపంచం మనవైపు ఆశగా చూస్తోంది
కన్యాకుమారి నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ వ్యాసం
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కన్యాకుమా రి(Kanyakumari) సాగరాల సంగమ క్షేత్రమే కాకుం డా సైద్ధాంతిక సంగమ క్షేత్రంగా విరా జిల్లుతోందని ప్రధాని మోదీ పేర్కొ న్నారు. ప్రపంచమంతా భారతదే శంవైపు ఆశగా చూస్తోందని యువ తే మన దేశానికి గొప్పబలమని గు ర్తు చేశారు. ఏడో దశ ఎన్నికల ప్రచా రం ముగిసినరోజు సాయంత్రమే కన్యాకుమారిలో 45 గంటల ధ్యాన oలో కూర్చున్న ప్రధాని(Prime Minister)జూన్ 1వ తేదీన కన్యాకుమారి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో కన్యాకుమా రిలో నా ఆధ్యాత్మిక సాధన అని
విమానంలోనే తన ఆలోచనలను ఒక వ్యాసంగా మలిచారు.అందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లో నే..
కన్యాకుమారిలో మూడు రోజుల ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని ఇప్పుడే ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కా ను. నా మనసంతా ఎన్నో అనుభ వాలు, అనుభూతులతో నిండిపో యింది. నాలోనే లోలోన అవధు ల్లేని శక్తి ప్రవాహాన్ని అనుభవి స్తున్నాను. కన్యాకుమారిలో భరత మాత పాదాల చెంత కూర్చున్న తొలి క్షణాల్లో ఎన్నికల(Election) హడావుడి నా మదిలో ప్రతిధ్వనించింది. ర్యా లీలు, రోడ్ షోలలో నేను చూసిన లెక్కలేనన్ని ముఖాలు నా కళ్ల ముం దుకొచ్చాయి. తల్లులు, సోదరీమ ణులు మరియు కుమార్తెల అపరి మితమైన ప్రేమ, వారి ఆశీస్సులు.. నా పట్ల వారి కళ్లలో ఉన్న నమ్మకం, ఆ ఆప్యాయత.. నేను ప్రతిదీ గ్రహిం చాను. నా కళ్లు తడిగా మారాయి. ఆ తర్వాత నేను ధ్యానంలోకి వెళ్లా ను. కొద్ది క్షణాల్లోనే రాజకీయ వాదో పవాదాలు, దాడులు, ఎదురుదా డులు ఆరోపణల స్వరాలు, మాట లు అన్నీవాటంతటవే శూన్యంలోకి వెళ్లిపోయాయి. నా మనసు బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా దూరమైం ది.
ఇంతటి బృహత్తర బాధ్యతల నడుమ ఇలాంటి సాధన కష్టమే అయినా కన్యాకుమారి భూమి, స్వామి వివేకానంద స్ఫూర్తితో(Inspiration of Swami Vivekananda)అది సులువైంది. కన్యాకుమారిలో ఉద యించే సూర్యుడు నా ఆలోచ నలకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాడు. సముద్రం వైశాల్యం నా ఆలోచన లను విస్తరింపజేసింది. కన్యాకు మారి ఎల్లప్పుడూ నా హృదయా నికి దగ్గరగా ఉంటుంది. “కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..” అనే మాట దేశంలోని ప్రతి ఒక్కరి హృద యంలో నిక్షిప్తమైన ఒక ఉమ్మడి గుర్తింపు. శక్తి మాత కన్యాకు మారిగా అవతరించిన శక్తిపీఠం ఇది. ఈ దక్షిణ చివరలో శక్తి మాత తపస్సు చేసి, భారతదేశం యొక్క ఉత్తర చివరలో హిమాలయాలలో కూర్చున్న శివుని కోసం వేచి ఉoది. మన దేశంలోని పవిత్ర నదులు వివిధ సముద్రాలలో కలిస్తే.. ఆ సముద్రాలు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ మరొక గొప్ప సంగమం కనిపిస్తుంది. అది భారతదేశ సైద్ధాంతిక సంగమం! వివేకానంద రాక్ మెమోరియల్ తో పాటు తిరువళ్లువర్ భారీ విగ్రహం, గాంధీ మండపం, కామరాజర్ మణి మం డపం ఉ న్నాయి. ఆ మహానుభా వుల ఆలోచనా ప్రవాహాలు ఇక్కడ జాతీయ ఆలోచనల సంగమాన్ని ఏర్పరిచాయి. అది జాతి నిర్మా ణానికి, గొప్ప ప్రేరణల ఆవిర్భా వానికి దారితీసింది. దేశ ఐక్యతను శంకించే వారికి కన్యాకుమారి గడ్డ చెరగని ఐక్యతా సందేశాన్ని ఇస్తుంది.
సందేశం.. లక్ష్యం.. గమ్యం..
“ప్రతి దేశానికీ అందించడానికి ఒక సందేశం ఉంటుంది. నెరవేర్చడానికి ఒక లక్ష్యం ఉంటుంది. చేరుకోవాల్సిన గమ్యం ఉంటుంది” అన్నారు స్వామి వివేకానంద. వేలాది సంవత్సరాలుగా భారతదేశం ఈ అర్థవంతమైన లక్ష్యంతో ముందుకు సాగుతోంది. భారతదేశం వేలాది సంవత్సరాలుగా ఆలోచనల పరిశోధన కేంద్రంగా ఉంది. మనం సంపాదించినదాన్ని ఎన్నడూ మన వ్యక్తిగత సంపదగా పరిగణించలేదు. మన సంపాదనను పూర్తిగా ఆర్ధిక, భౌతిక పరామితుల్లో తూకం వేయలేదు. అందుకే.. ‘ఇదం నమమ (ఇది నాది కాదు)’ అనే భావన భారతదేశ సహజ స్వభావంగా మారింది. భారతదేశ సంక్షేమం.. యావత్ ప్రపంచ శ్రేయోభివృద్ధి ప్రస్థానానికీ ఉపయోగపడుతుంది. ఉ దాహరణకు.. మనకు స్వాతంత్ర్యం వచ్చేనాటికి ప్రపంచంలో చాలా దేశాలు వలస పాలనలోనే ఉన్నాయి. మన స్వాతంత్య్ర ప్రస్థానం చాలా దేశాలకు స్ఫూర్తిగా నిలిచి, స్వాతంత్య్రాన్ని సాధించుకునే బలాన్నిచ్చింది. దశాబ్దాల తర్వాత అదే స్ఫూర్తి.. శతాబ్దానికొకసారి సంభవించే కొవిడ్-19(Covid-19)మహమమ్మారిని ప్రపంచం ఎదుర్కొంటున్నప్పుడు.. మరోసారి కనిపించింది. ఆ సమయంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నప్పుడు.. భారతదేశ విజయవంతమైన ప్రయత్నాలు అనేక దేశాలకు ధైర్యాన్ని, సహకారాన్ని అందించాయి.
భారతదేశ పాలన నమూనా నేడు ప్రపంచంలోని అనేక దేశాలకు ఉదాహరణగా మారింది. కేవలం పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడం అపూర్వం. పేదల సాధికారతకు, వారి హక్కులను కాపాడడానికి, పారదర్శకతను తేవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉ పయోగించవచ్చో చూపడం ద్వారా.. మన ‘డిజిటల్ ఇండియా'(Digital India)ప్రచారం నేడు యావత్ ప్రపంచానికీ ఒక ఉ దాహరణగా నిలిచింది. భారతదేశంలో చౌక ధరలకు లభిస్తున్న డేటా.. పేదలకు సమాచారం, సేవలు అందుబాటులో ఉండేలా చూడటం ద్వారా సామాజిక సమానత్వ మాధ్యమంగా మారుతోంది. పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు మన నమూనా నుండి నేర్చుకోవాలని అనేక దేశాలకు సలహా ఇస్తున్నాయి. జీ-20 విజయం తర్వాత.. భారతదేశం మరింత బృహత్తర పాత్రను పోషించాలన్న భావన ప్రపంచ దేశాల్లో పెరుగు తోంది. గ్లోబల్ సౌత్కు బలమైన, ముఖ్యమైన గొంతుగా భారత్ కు ఆమోదం లభిస్తోంది.
Triveni Sangam confluence At Kanyakumari