Central govt funds: గ్రామాలకొచ్చే నిధులన్నీ కేంద్రానివే
గ్రామ పంచా యతీలకు వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే ఆ నిధులను సద్వి నియోగం చేసుకుంటూ వేరే పార్టీలు మేము నిధులు కేటాయిస్తున్నామని మాయమాటలు చెప్పుకుంటూ విప క్ష ప్రభుత్వాలు పబ్బం గడుపుతు న్నారని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అన్నారు.
మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించిoది బిజెపి ప్రభుత్వం
గత పదేళ్ళలో ఉగ్ర వాదుల జాడ లేకుండా చేసింది బిజెపి
ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోది ప్రధాని కావడం ఖాయం –రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ
ప్రజా దీవెన, కోదాడ:గ్రామ పంచా యతీలకు వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే ఆ నిధులను సద్వి నియోగం చేసుకుంటూ వేరే పార్టీలు మేము నిధులు కేటాయిస్తున్నామని మాయమాటలు చెప్పుకుంటూ విప క్ష ప్రభుత్వాలు పబ్బం గడుపుతు న్నారని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ(CM Bhajan Lal Sharma) అన్నారు. మంగళ వారం పట్టణంలో బిజెపి జన జాత ర సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షు లు బొబ్బ భాగ్యరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, చౌడ శ్రీనివాసరెడ్డి సంకినేని వెంకటేశ్వరరావు మల్లెబోయిన అంజి యాదవులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భజన్ లాల్ శర్మ(CM Bhajan Lal Sharma) మాట్లాడుతూ గత పది సంవత్స రాల నుండి కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఉగ్రవాదుల అరాచకాలుగాని జరగట్లేదంటే కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం అని అన్నారు. రాష్ట్రా లలో గ్రామాలు అభివృద్ధి చెందుతు న్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధు లే కారణమని ఆయన అన్నారు. బిజెపి(BJP) వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా రు అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ వారికి ఈ సభ వేదికగా నేను చెప్పే ది ఒకటే నరేంద్ర మోడీ రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ లు అటకెక్కినాయి రైతులు ఆర్థికం గా ఇబ్బంది పడుతున్నారు అయి నా సరే పట్టించుకోకుండా వారికి ఓట్లే ముఖ్యం అనుకుంటూ ప్రచారా లు నిర్వహిస్తున్నారని అన్నారు.
అనంతరం ఎంపీ అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డి(Saidi Reddy) మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని ఇవ్వకుండా మహిళలను మోసం చేసిందని అన్నారు. కౌలు రైతులకు పైసలు ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని అన్నా రు. నన్ను నల్లగొండ పార్లమెంటు బిజెపి అభ్యర్థిగా గెలిపిస్తే హైదరా బాదు టు విజయవాడ పాస్ట్ ట్రైన్ రైలు మార్గం నరేంద్ర మోడీ నాయక త్వంలో వేయిస్తానని అన్నారు. కేంద్రంలో బిజెపికి 400 సీట్లు తో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అవుతున్నాడని అన్నారు. హుజూర్ నగర్ కోదాడ నియోజ కవర్గం కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చీకోటి ప్రవీణ్ కనగాల నారాయణ శ్రీలత రెడ్డి, బొలిశెట్టి కృష్ణయ్య నూనె సులోచన యాద రమేష్ అక్కిరాజు యశ్వంత్ సాతులూరి హనుమంతరావు, కోట కొమ్ముల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
Village developed with central govt funds