Viral Video : ప్రజా దీవెన, తమిళనాడు: పిచ్చి పీక్ స్టేజ్ అన్నట్లు ఏదైనా పనిని అ తిగా చేయడం, లేదా ఏదైనా విష యంపై చాలా ఎక్కువ ఉత్సాహం లేదా ఆవేశం చూపించడం వంటి చర్యలు ఉదహరిస్తాయి. అయితే ఇక్కడ అదే మాదిరి పిచ్చి ప్రదర్శన చోటు చేసుకుంది. బుద్ధుడు పుట్టిన పుణ్యభూమిలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చో టుచేసుకోవడం అందరినీ నువ్వేర పరుస్తుంది. తేనీలోని ఒక ప్రైవేటు షెల్టర్ హోమ్ లో ఓ చిన్నారిని చెత్త డబ్బాలో వేసి చిత్రహింసలు పెడు తూ భయభ్రాంతులకు గురిచేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మా రుతుంది. తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే… ఒక ప్రైవేటు పిల్లల హోమ్ లో ఒక పసిబిడ్డను చెత్త డబ్బాలో వేసి పైకి కిందికి ఊపుతూ ఆ డ బ్బాను దొర్లిస్తున్నట్లుగా, ఇద్దరు సి బ్బంది చేసిన చర్యలు ప్రతి ఒక్క రిని నివ్వెరపోయేలా చేశాయి. ఒక టిన్నర ఏళ్ల చిన్నారి భయపడుతూ ఏడుస్తున్న వదిలిపెట్టకుండా ఇద్ద రు అమ్మాయిలు డస్ట్ బిన్ ను ఉ య్యాలలా ఊపుతూ చేసిన పైశా చిక చర్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు రాష్ట్రంలోని తేనిలో జేజే ప్రొజెడీస్ లో జరిగిన ఈ సం ఘటనలో ఉద్యోగాలు చేసే తల్లి దండ్రులు సహజంగా పిల్లలను ఈ ప్రైవేట్ హోమ్ డే కేర్ హోంలో వది లి వెళ్లి సాయంత్రం జాబ్ పూర్తయి న తర్వాత తిరిగి ఇళ్లకు తీసుకు వె ళ్తారు. ఈ పిల్లలను జాగ్రత్తగా చూ సుకోవలసిన బాధ్యత షెల్టర్ ఇస్తు న్న సిబ్బంది పైన ఉంటుంది. ఈ హోం ను జెన్నీఫర్ అనే మహిళ నిర్వహిస్తోంది.
చెత్తబుట్టలో చిన్నారితో ఆట లు… అయితే ఈ హోమ్ లో జరి గినటువంటి దారుణ ఘటన అక్క డి సిబ్బంది పైశాచికత్వానికి నిదర్శ నంగా నిలిచింది. పిల్లవాడిని పడేసి నట్టు చెత్త డబ్బాలో వేసి అటు ఇ టు ఊపుతూ పసికందు ఏడుస్తు న్నా వదిలిపెట్టకుండా వారు పైశా చికానందాన్ని పొందారు. ఇది చూ సిన ప్రతి ఒక్కరు తీవ్రంగా కలత చెందారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత జిల్లా బాలల రక్షణ విభాగానికి దీనిపైన ఫిర్యాదు చేశారు.
జిల్లా బాలల రక్షణ విభాగానికి సంబంధించిన సిబ్బంది హోమ్ ను సందర్శించి అక్కడ సిబ్బందిని ప్ర శ్నించారు. అయితే గత నాలుగు నెలల క్రితమే ఈ వీడియో రికార్డు చేయబడిందని, కానీ ప్రస్తుతం వైరల్ గా మారుతుందని అక్కడి సిబ్బంది తెలిపారు. పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా సిబ్బంది ఇలా ప్రవర్తించినట్టు వారు పేర్కొన్నారు.
అయితే వారిచ్చిన వివరణ బాలల సంరక్షణ విభాగానికి చెందిన అధి కారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ విషయం పైన సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. హోమ్స్ లో పిల్ల లపైన ఈ విధమైన చిత్రహింసలకు గురి చేయడానికి ప్రయత్నించే వారి ని సహించకూడదని, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థాని కులు డిమాండ్ చేస్తున్నారు.
torture child in tamilnadu pic.twitter.com/oGB93WlyF5
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 27, 2025