–విండోస్–10 కంప్యూటర్లలో ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’
–ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిన విమాన, బ్యాంకింగ్ సేవలు
–శంషాబాద్‌లో 39 దేశీయ సర్వీ సుల రద్దు, 44 ఆలస్యంగా
–విశాఖలో 4 విమానాల రద్దు, గన్నవరంలో 15 జాప్యం
–ఎయిర్‌పోర్టుల కిటకిట రద్దీతో ప్రయాణికుల అవస్థలు
–పలు దేశాల స్టాక్ మార్కెట్లలో లావాదేవీలకు అంతరాయo
–సైబర్ భద్రత సంస్థ ‘క్రౌడ్‌స్ట్రైక్’ అం దించిన అప్డేట్లో బగ్సమస్యను గుర్తించి సంక్షోభాన్ని పరిష్కరించిన క్రౌడ్‌స్ట్రైక్
Windows – 10:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఎక్కడ చూ సినా ఎర్రర్..ఎర్రర్ అంటూ ఆందో ళనలు, విండోస్ 10 ఆప రేటింగ్ (Windows 10 op ratingసిస్టమ్‌లో బగ్ వల్ల శుక్ర వారం ప్రపంచవ్యాప్తంగా ఆ ఓఎస్ ను వాడుతున్న డెస్క్‌టాప్, ల్యాప్ టాప్లలో ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ సమస్య తలెత్తి టెర్రర్ గా నిలిచింది. కంప్యూటర్ ఆన్ చేయ గానే ఒక దశ దాకా వచ్చి బ్లూ స్క్రీ న్ ఎర్రర్ రావడం, మళ్లీ దానంతట అదే రీస్టార్ట్ కావడం, ఒక లూప్‌లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా విండో స్ ఓఎస్ వాడే డెస్క్‌టాప్‌లు, ల్యాప్ టాప్ల సంఖ్య దాదాపు 73 శాతం దాకా ఉండడం కారణంగా ఆ కం ప్యూటర్లన్నీ ఆన్ కాకుండా మొరా యించడంతో పెను సంక్షోభమే తలెత్తింది. చాలా దేశాల్లో విమానా లు ఎగరలేదు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజీల్లో లావాదేవీలు జరగలే దు, పలు మీడియా సంస్థల ప్రసా రాలు నిలిచిపోయాయి. వ్యాపారా లు తాత్కాలికంగా మూతపడ్డాయి.
ఆస్పత్రుల్లో కంప్యూటర్లు పనిచేయక పేషెంట్లు (patients) కొన్ని గంటలపాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో సేవారంగంలో (Service sector at international level) సంక్షోభం నెలకొంది అంటే అతిశ యోక్తి కాదు. మన విమానాశ్రయా ల్లో అయితే ఎన్నడూ లేని విధంగా బోర్డింగ్ పాస్‌లను సిబ్బంది తమ చేత్తో రాసిచ్చారు, కొన్ని విమానా లను దారి మళ్లించారు. కొన్ని విమానాలను రద్దు చేశారు. మన దేశంలోనూ ఈ సమస్య కారణంగా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాటిలో ఒక్క ఇండి గో కంపెనీకి చెందినవే 200కు పైగా ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయి రిండియా విమానాన్ని ఈ సమస్య కారణంగా రష్యాకు తరలించినట్టు సమాచారం. ఇంకా.. స్పైస్‌జెట్, ఆకాశ, విస్తారా, ఇలా విమానాలు రద్దయిపోవడం, ఆలస్యం కావ డంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా పలు ప్రధాన నగరాల్లోని వి మానాశ్రయాలు అక్కడ చిక్కుకు పోయిన ప్రయాణికులతో కిటకి టలాడిపోయాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) 39 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. 44 దేశీయ 10 అంతర్జాతీయ సర్వీ సులు ఆలస్యంగా నడిచాయి. కం ప్యూటర్లు పనిచేయకపోవడంతో టికెట్లపై ప్రయాణికుల పేర్లు, సీటు నంబర్లు, ఇతర వివరాలను చేత్తో రాసిచ్చారు. అలాగేడిజిటల్ డిస్ప్లే బోర్డులు పనిచేయకపోవడంతో సైన్ బోర్డులపై (Sign boards)విమానాల రాకపోకల వివరాలు రాసి అక్కడక్కడా పెట్టా రు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ కపోవడం టికెట్లు రద్దు చేయకపో వడంతో పలువురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టు సిబ్బందితో వాగ్వాదా నికి దిగారు. 10 గంటలుగా పడిగా పులు కాస్తున్నా ఎయిర్‌లైన్స్, జీఎం ఆర్ అధికారులెవరూ పట్టించుకోవ ట్లేదoటూ మండిపడ్డారు. రాత్రి 10. 30 గంటల సమయంలో ఆందో ళనకు దిగడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు వారిని సముదాయిం చే ప్రయత్నం చేశారు. అయినా వారు ఆందోళన విరమించలేదు.
ఒకదశలో కొట్టుకునే స్థాయిలో తో పులాట కూడా జరిగింది. అటు విశాఖ విమానాశ్రయంలోనూ నా లుగు విమానాలు రద్దు కాగా విజయవాడ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం కావడంతో ప్ర యాణికులు తీవ్రంగా ఇబ్బం దిప డ్డారు. ఈ పరిణామాల నేపథ్యం లో కేంద్ర పౌర విమానయాన శాఖ మం త్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) స్పందిం చారు. వీలైనంత త్వరగా ఈ సమ స్యను పరిష్కరించేందుకు కృషిచే స్తున్నట్టు తెలిపారు. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పలు దేశా ల్లో ప్రధాన విమానయాన సంస్థలు అన్ని సర్వీసులను రద్దు చేయ డంతో ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం నెలకొంది.
బ్యాంకింగ్, వాణిజ్య సేవలు..
మైక్రోసాఫ్ట్ ఓఎస్‌లో బగ్ కారణంగా మనదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ (State Bank of India, ICICI) తదితర బ్యాం కుల ఆన్లైన్ సేవలకు అంతరా యం కలిగినట్టు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. అయితే, ఎస్బీఐ అధికారులు మాత్రం తమ సిస్టమ్స్ లో ఎలాంటి సమస్యా తలెత్తలేదని వివరణ ఇచ్చారు. మొత్తం మీద 10 బ్యాంకింగ్, బ్యాంకింగేతర వ్యవస్థల పై కొద్దిపాటి ప్రభావం పడిందని ఆర్బీఐ తెలిపింది. అలాగే ఈ సమ స్య వల్ల ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, 5పైసా వంటి బ్రోకరేజీ సంస్థలు, మోతీ లాల్ ఓస్వాల్, ఎడెల్వెయిస్ వంటివాటి కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది. పలు దేశా ల స్టాక్ ఎక్స్చేంజీలపైనా దీని ప్రభా వం పడిందిగానీ మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేకుండా పనిచేసింది. ఈ సమస్య కారణంగా కొద్దిసేపు తమ ఉత్పత్తి, డిస్పాచ్ ఆపరేషన్స్‌ను నిలిపి వేసి నట్టు మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. ఓఎస్ సమస్య కార ణంగా తలెత్తిన సంక్షోభంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పం దించారు. దీనిపై ‘కంప్యూటర్ ఎమ ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (Computer Emergency Response Team)(సెర్ట్–ఇన్) సాంకేతిక మార్గదర్శకాలు జారీ చేస్తుందని వెల్లడించారు. వెంటనే సెర్ట్–ఇన్ ఆ మార్గదర్శకాలు జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ కూడా శుక్ర వారం సాయంత్రానికి సమస్యను పరిష్కరించినట్టు ప్రకటించి సంక్షో భం నుంచి బయటపడేసింది.