Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, నిజామాబాద్‌లో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌

Big Breaking : ప్రజా దీవెన , నిజామాబాద్: నిజా మాబాద్ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌ చోటు చేసుకుంది. ఓ కే సులో అరెస్టు అయిన నిందితుడు సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉండగా గురువారం రాత్రి మృతి చెందాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అ యితే పోలీసులు చిత్రహింసలు పె ట్టడంతోనే మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా రు. హాస్పిటల్‌ ముందు ఆందోళన కు దిగారు. తమకు న్యాయం చే యాలని, బాధ్యులపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం జగిత్యాల జిల్లాకు చెందిన సం పత్ అనే యువకుడు శ్రీరామ ఇం టర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతని ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నిజామా బాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సంప త్‌తోపాటు మరో ఏజెంట్‌పై పది రో జుల క్రితం కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరుపరిచి రిమాండ్‌కు తర లించారు. అయితే బాధితుల డ బ్బులు రికవరీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ నిమిత్తం రెం డు రోజుల క్రితం కోర్టు అనుమతి తో కస్టడీకి తీసుకున్నారు. విచా రణలో భాగంగా గురువారం మ ధ్యాహ్నం సంపత్‌ను తన స్వస్థ లమైన జగిత్యాలకు తీసుకువె ళ్లా రు. గురువారం రాత్రి 9.45 నిమి షాలకు తిరిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.

కొద్ది సేప టికే తన చెయ్యి నొప్పిగా ఉందని నిందితుడు చెప్పడంతో చికిత్స ని మిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్ది సమయానికి సంపత్ మరణించా డు. దీంతో పోలీసులు విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు సమా చారం అందించారు.శుక్రవారం ఉద యం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న మృతుని కుటుంబ స భ్యులు, బంధువులు హాస్పిటల్‌ ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల టార్చర్ వల్లే సంపత్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంపత్ మృతికి కారణమైన వారిపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ఈనేపథ్యంలో హాస్పిటల్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించా రు. ఈ ఘటనపై విచారణ నిర్వ హించేందుకు మేజిస్ట్రేట్ నిజామా బాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి రా నున్నట్లు పోలీసు వర్గాలు తెలి పాయి.