Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rythu bandhu : శనీశ్వరరావుకు శంకరగిరిమాణ్యాలే

రాష్ట్రం లోని 69 లక్షల మంది రైతుల ఖాతా ల్లో ఈనెల 6వ తేదీలోపే రైతుబం ధు నిధులు వేశామని, కేసీఆర్‌కు సిగ్గుంటే అమరవీరుల స్తూపం వద్దనో లేదంటే ఆర్మూర్‌ అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గరకు వచ్చి ముక్కు నేల కు రాయాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మే 9లోపు అన్నట్లుగా 69 లక్షల మందికి ఆరవ తేదీలోపే వేశాము
రైతుభరోసా వచ్చిందో లేదో ఒక్క రైతు ఖాతాలోనైనా చూసుకోండి
కేసీఆర్‌కు సిగ్గుంటే అమరవీరుల స్తూపమో,ఆర్మూర్‌ అంబేడ్కర్‌ చౌర స్తా వద్దో ముక్కు నేలకు రాయాలి
పసుపుబోర్డు ను(Turmeric board) గాలికొదిలేసి నిజామాబాద్‌ రైతులకు బిజెపి మో సం
నిజామాబాద్‌, ఆర్మూర్‌ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, నిజామాబాద్‌: రాష్ట్రం లోని 69 లక్షల మంది రైతుల ఖాతా(Farmers) ల్లో ఈనెల 6వ తేదీలోపే రైతుబం ధు నిధులు వేశామని, కేసీఆర్‌కు(CM KCR) సిగ్గుంటే అమరవీరుల స్తూపం వద్దనో లేదంటే ఆర్మూర్‌ అంబేడ్కర్‌ చౌరస్తా దగ్గరకు వచ్చి ముక్కు నేల కు రాయాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.పంద్రాగస్టు లోపు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీశ్‌ రావు శపథం చేశారని అంటూ ఆర్మూర్‌ సిద్దులగుట్ట సాక్షిగా చెబు తున్నా ఆగస్టు 15కల్లా ఇచ్చిన మా ట ప్రకారం రుణమాఫీ చేస్తానని సిద్ది పేటకు పట్టిన శనీశ్వరరావును శా శ్వతంగా వదిలిస్తానని వ్యాఖ్యానిం చారు.

ప్రచారంలో ప్రజలను తప్పు దోవ పట్టించడం కాదు, రైతు భరో సా(Rythu bharosa) వచ్చిందో రాలేదో ఏ రైతు ఖాతా లోనైనా చూసుకోడoటూ సవాల్ చేశారు.ఈ నెల 9లోపు రైతుభరో సా వేస్తానని వేయలేకపోతే అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ చేశానని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బుధవారం నిజా మాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌తో పాటు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలు, కార్నర్‌ సమావేశాల్లో ఆయన ప్రసంగించా రు . 2014లో పార్లమెంట్‌కు జరి గిన ఎన్నికల్లో తనను గెలిపిస్తే వంద రోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపి స్తామని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారని, కానీ, ఆమె ఆ హామీని నిలబెట్టుకోకుండా రైతులను మో సం కేసీఆర్ చేశారని మండి పడ్డా రు.

దీంతో 2019 ఎన్నికల్లో వంద మంది రైతులు(Farmers nominations) నామినేషన్లు వేసి. మోసం చేసిన కవితను ఓడించార ని, ఆ ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి చ్చిన ధర్మపురి అర్వింద్ ను గెలి పించారని గుర్తుచేశారు. ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకువస్తానన్న అర్వింద్ కూడా ఐదేళ్లు గడిచినా, ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఆ ర్మూర్ రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిం దని రేవంత్ ఆవేదన వెలిబుచ్చా రు. నిజామాబాద్ కు పసుపు బోర్డు రావాలన్నా చక్కెర కర్మాగారాలు తెరుచుకోవాలన్నా, వ్యవసాయం తెలిసిన ఆదర్శ రైతు జీవన్ రెడ్డి పార్లమెంటుకు పంపించాలని పిలు పునిచ్చారు. ఇప్పటికే తాము చక్కె ర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసం ఘాన్ని ఏర్పాటు చేశామని, ఫ్యాక్టరీ లను తెరిపించడానికి ప్రయత్నాల ను ముమ్మరం చేస్తున్నామని పేర్కొ న్నారు.

ఇప్పటికే రూ. 43 కోట్ల బకా యిల చెల్లింపుల కోసం విడుదల చేశామని వివరించారు.కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న ప్రధాని మోదీ నిజామాబాద్ రైతులను మోసం చేశారని, నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ తేలేదని, చెరకు ఫ్యాక్టరీ లను తెరిపించలేదని, చెరకు రైతుల కు(Farmers) మద్దతు ధరలనూ నెరవేర్చనం దుకు బీజేపీని గెలిపించాలా అని సీఎం ప్రశ్నించారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని, రాష్ట్రంలో పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లో బీసీ గణన చేపట్టి రిజర్వేషన్ పెంచే బాధ్యత తమ ప్రభుత్వానిదే నని ప్రకటించారు.బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామన్న వారిని గద్దె దించా లని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేష న్లను తీసేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పదేళ్లకొకసారి చేపట్టే జనాభా లెక్క లను 2021లో ఎందుకు చేపట్టలే దని దేశవ్యా ప్తంగా బీసీ కులగణన కు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణకు గాడి ద గుడ్డు తప్ప ఇచ్చింది ఏమీ లేద న్నారు. విభజన చట్టంలో పొందు పర్చిన ఏ హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు.

పదేళ్లు పదిలంగా ఉంటాం…

రాష్ట్రంలో తమ ప్రభుత్వం పదేళ్ల పాటు ఉంటుందని రేవంత్ పేర్కొ న్నారు. కానీ తెలంగాణ కేడీ కేసీఆర్ మాత్రం మేం దిగిపోవాలంటున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డ బెయిల్ కోసం నిజామాబాద్ కార్యక ర్తల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెడతావా కేసీఆర్ అంటూ నిల దీశారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా ఒక్కటేనని, కేడీ, మోదీ ఒక్కటేనని ఆరోపిం చారు. ప్రజల రక్షణకు అండగా ఉండే కాంగ్రె ఎకు మద్దతు ఇవ్వా లని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్(Nizamabad) అభివృద్ధికి తాను అండగా ఉంటానని. జీవన్రెడ్డిని గెలిపిస్తే నిజామాబాద్ కు రింగ్ రోడ్ వేయించే బాధ్యత తనదేనని, నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయడంతో పాటు ఇతర అభివృద్ధి పనులను కూడా చేపడుతామని రేవంత్ హామీ ఇచ్చారు.

BJP fraud Turmeric farmers