Amit Shah: తెలంగాణలో బిజెపి కి పక్కా పది సీట్లు
లోక్ సభ ఎన్నికల్లో బిజెపి పక్కా పది ఎంపీ స్థానాలు కైవసం చేసుకుం టుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు.
ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఇస్తాం
రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడి యోలు సృష్టించింది
వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్ వెంట పోలీసులు పడరా
రాహుల్ గాంధీకి ఏటీఎంలా తెలంగాణ ప్రభుత్వం
మజ్లిస్, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ముగ్గురూ కలిసే ఉన్నారు
కాగజ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ప్రజా దీవెన, నిజామాబాద్: లోక్ సభ ఎన్నికల్లో(Lok Sabha elections) బిజెపి పక్కా పది ఎంపీ స్థానాలు కైవసం చేసుకుం టుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఏటీఎంలా ఉప యోగపడుతోందని ఆరోపించారు. ఇక్కడ ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరిట రూ.కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారన్నారు. ఆర్‌ఆర్ అంటే రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ట్యాక్స్ అని కాంగ్రెస్ పాలన అంటేనే ఇలా ఉంటుందని విమర్శించారు.ఆదివారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో, నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాలలో, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించారు.
ఎండలు పెరగ్గానే రాహుల్ బాబా థాయ్‌లాండ్, బ్యాంకాక్ విహారయా త్రలకు వెళ్లిపోతారని చెప్పారు. రాహుల్ బాబా లేనిపోని ఆరోప ణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్(Congress) అంటేనే ముస్లింలను పెంచి పోషించడమ న్నారు. బీజేపీ అధికారంలోకి రాగా నే ముస్లిం రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అదనంగా వాటిని వర్తింపజేస్తామని ప్రకటిం చారు. మూడోసారి మోదీ(Modi) వస్తే రిజ ర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అవి తప్పుడు ప్రచా రాలని, ఈ పదేళ్లలో రిజర్వేషన్లు ఏమైనా తీసేశారా అని ప్రశ్నించారు.
ఇండియా కూటమికి అసలు నాయ కత్వమే లేదని, కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్ కావాలా సీఎంగా, పీఎంగా 23 ఏళ్లు పాలించినా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని మోదీ కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆరోపించారు. నరేంద్ర మోదీ పాలనలో ఉగ్రవా దాన్ని, తీవ్రవాదాన్ని, నక్సలిజాన్ని పూర్తిగా అణచివేశామని వెల్లడిం చారు. కరోనా సమయంలో ప్రజలం దరికీ ఉచితంగా టీకాలు అంద జేస్తే రాహుల్‌బాబా వ్యాక్సిన్లపైనా దు ష్ప్రచారం చేశాడని, చివరికి ఆయ న, సోదరి కలిసి చీకట్లో టీకాలు వేయించుకున్నారని చెప్పారు.
తెలంగాణలో(Telangana) రూ.40 వేల కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేసినట్లు అమిత్ షా(Amit Shah) తెలిపారు. ఇందులో మంచిర్యాల నుంచి ఉట్నూరు మీదుగా ఆదిలాబాద్‌కు బ్రాడ్‌గేజ్ రైల్వే నిర్మాణం కూడా ఉందన్నారు. బీజేపీ హయాంలో చేపట్టిన ప్రత్యేక నిబంధనలతోనే పరిశ్రమల పునరుద్ధరణ జరిగినట్లు చెప్పారు. బీజేపీ(BJP) ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను పెంచుతామన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 10 సీట్లు పక్కాగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వ హిస్తోందని, బీఆర్‌ఎస్, కాం గ్రెస్ ఆ విషయం జోలికి వెళ్లవని, ఒవైసీ వాటిని విమోచన దినోత్సవం చేయనిస్తాడా అని ప్రశ్నించారు.
BJP win 10 Parliament seats in Telangana