Komatireddy Venkatareddy: ఫలితాల తర్వాత రాష్ట్రంలో బిఆర్ఎస్ కనుమరుగు
లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయ మని రాష్ట్ర రోడ్లు భవనాలు సిని మాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Roads Buildings Cinematography Minister Komatireddy Venkatareddy) పునరుద్ఘాటించారు.
వచ్చే పదేళ్లు రాష్ట్రంలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం
మీడియా సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నిజామాబాద్: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయ మని రాష్ట్ర రోడ్లు భవనాలు సిని మాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Roads Buildings Cinematography Minister Komatireddy Venkatareddy) పునరుద్ఘాటించారు. తెలంగాణలో మరో పదేళ్ల పాటు రేవంత్ ప్రభుత్వమేనని అధికారం లో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎ స్ కు తావులేదని ఆయన అన్నా రు. శనివారం నిజామాబాద్(Nizamabad) నగరం లో నిర్వహించిన మీడియా సమా వేశంలో మంత్రి కోమటి రెడ్డి మాట్లా డుతూ సోనియా గాంధీ (Sonia gandhi)లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాదను కున్న తెలంగాణ సోనియమ్మతోనే వచ్చిందన్నారు.
పది సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలను కేసీఆర్(KCR) మోసం చేసిందని మండిప డ్డారు. గొర్రెల స్కామ్ రూ.700 కోట్లు కాదని, మొత్తంగా రూ.4500 కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు. లిక్క ర్ స్కామ్ తో బతుకమ్మ కవిత తెలంగాణ రాష్ట్రం పరువు తీసింద ని వ్యాఖ్యానించారు. బతుకమ్మల చాటున లిక్కర్ వ్యాపారం చేశారని ఆరోపించారు. రాష్ట్రీయ గీతంపై కేటీఆర్ రాద్ధాంతం చేయడం ఏమి టని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నిక ల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని విమర్శించారు. రాజముద్ర పై బీఆర్ఎస్ మాట్లాడ డం సిగ్గుచేటన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో అందరూ రావులే ఉన్నారని విమర్శించారు. నిజామాబాద్ పార్ల మెంట్ తో సహా 12స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశవేణు, రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, వేణురాజ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
BRS disappeared after parliament elections