Canada Student Death: ప్రజా దీవెన, హైదరాబాద్: కెనడా (Canada)లో ఎం.ఎస్ చేయడానికి వెళ్లిన ప్రణీత్ అనే యువకుడు చెరువులో ఈతకు వెళ్లి దురదృష్టవశాత్తు చనిపోయాడు. హైదరాబాద్ (Hyderabad) మీర్‌పెట్ (Meerpet)కి చెందిన రవి సునీతకి ఇద్దరు కుమారులు కాగా వీరిద్దరూ కెనడాలోనే ఉన్నత చదువుల కోసం 2019లో వెళ్లారు. నిన్న చిన్న కుమారుడు పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటో (Toronto)లోని లేక్ క్లియర్ (Lake Clear)కి ఔటింగ్ కి వెళ్లారు.
ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. పుట్టిన రోజే (Birth day) మరణించిన రోజు (Death day) కావడంతో వీరి బాధ మరింత రెట్టింపు అయ్యింది. కుమారుడి మృతదేహాన్ని త్వరగా ఇండియా (India)కి చేరడానికి ప్రభుత్వం సహకరించాలని తండ్రి వేడుకున్నారు.