Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Car Lorry Accident: బిగ్ బ్రేకింగ్, లారీని ఢీకొట్టిన కారు, ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం 

Car Lorry Accident: ప్రజా దీవెన, నార్కెట్‌ప‌ల్లి: న‌ల్ల‌గొండ (Nalgonda) జిల్లా ప‌రిధిలోని నార్కె ట్‌ప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఏపీ లింగోటం గ్రామ శివా రు స‌మీపంలో జాతీయ ర‌హ‌దారి 65పై ఆదివారం తెల్ల‌వారుజామున అతి వేగంగా దూసుకొచ్చిన కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డి క‌క్క‌డే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న ఎస్ఐ క్రాంతి కుమార్ ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. హైద‌రాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన ఐదుగురు వ్య‌క్తులు కారులో విజ‌య‌వాడ‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు.

 

అయితే లారీని హైవేపై ఆపి టీ తాగుతుండ‌గా అదే స‌మ‌యంలో కారు వేగంగా వ‌చ్చి దాన్ని ఢీకొ ట్టింది. కారులో ప్ర‌యాణిస్తున్న సాయి, ప్ర‌వీణ్ ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాల‌ పాల‌య్యారు. ఈ ముగ్గురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నార్కెట్‌ప‌ల్లి కామినేని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ తెలిపారు. మృతుల కుటుంబాల‌కు స‌మాచారం అందించారు.