— ప్రజల పక్షాన బిఆర్ఎస్ పోరాటాలకు సిద్ధం
— రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తీవ్ర నష్టం
— నల్లగొండ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు
Cement Factory Public Opinion: కంచర్ల, రవీంద్ర కుమార్, గాదరి కిషోర్ కుమార్ ప్రజా దీవెన, నల్లగొండ: పచ్చని పొలాల్లో విషం చిమ్మేందుకు, ప్రజల నిలువునా ముంచే సిమెంట్ ఫ్యాక్టరీకి ఏమి ఆశించి రామన్న పేట (Ramannapeta)లో అనుమతి ఇచ్చారని బీఆర్‌ఎస్ నేతలు (BRS leaders) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ తమ నాయకులను ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు. రామన్న పేట ప్రజల పక్షాన తాము పోరాటానికి సిద్ధమని బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డిలతో కలిసి ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ (Cement Factory) ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలకు కలిగే ఇబ్బందులను గమనించాలని, పచ్చటి పొలాలతో అలరారు తున్న ఆ ప్రాంతాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారా, ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతించబోమని, ప్రజల పక్షా న ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజల పక్షాన నిలబడండి, పోలీస్ జులుంతో ప్రజాభిప్రాయ సేకరణ (Public Opinion)కు తమ నాయకులను వెళ్ళనీయకపో వడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ప్రోటోకాల్ లో ఉన్న తనను కూడా అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా, అనువు కాని ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీనా అంటూ ఎమ్మెల్సీ కోటిరెడ్డి నిలదీశారు. రా మెటీరియల్ (Raw material) లేదు, నీళ్లు లేవు, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏమిటి దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎక్కడకి పోయారు, మూసి (Musi) కాలుష్యంపై బీర్ఎస్ పార్టీ నాయకులపై తెగ మాట్లాడేసిన మీరు ఇప్పుడు రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మీ అభిప్రాయం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంత ప్రజల మంచి కోరే వారైతే తక్షణమే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ( Ambuja Cement factory)కి ఇచ్చిన అనుమతులు రద్దు చేయించాలని, దీనిపై మీ సోదరులు ఇద్దరే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాట్లు ఏదో మతలబుందని, అందుకే ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ప్రజలను నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు (Arrest) చేసి అక్కడికి పోకుండా చేశారని ఆరో పించారు. ఏమీ లేకపోతే పోలీస్ నిర్బంధం ఎందుకని, ఎవరి ప్రోద్బలంతో పోలీసులు, నాయకులను అడ్డుకున్నారో రాచకొండ పోలీస్ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్నానంటూ సుద్ధ పూసలు చెప్పే పెద్ద నాయకులు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసి ప్రక్షాళనపై తమ నాయకులపై ఆవాకులు చవాకులు పేలిన వారు ఇప్పుడు అంబుజా సిమెంట్ ఫ్యా క్టరీ పై ఏం చెప్తారు, ఓ పక్క మూసి కాలుష్య ప్రక్షాళన అంటూ పేదల బతుకులు ఛిద్రం చేస్తూ మరోపక్క సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యాన్ని నల్గొండ ప్రజలకు అందించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
ఆ ప్రాంత ప్రజల పోరాటాలకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, నల్లగొండ మున్సి పల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి, నల్లగొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్ రెడ్డి, ఏడో వార్డ్ కౌన్సి లర్ మారగోని గణేష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రి, రంజిత్ , మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, మాతంగి అమర్, కందుల లక్ష్మయ్య, తిప్పర్తి మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, విద్యార్థి విభాగం నాయకుడు నాగార్జున, కందిమల్ల నరేందర్ రెడ్డి,ఫణి, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.