CI Rajasekhar Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మార్చి 2 న నిర్వహించే నల్లగొండ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ కరపత్రం వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. అనంతరం సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఎప్పుడు ధర్నాలు ఆందోళనలు బంద్ లు కాకుండా పదో తరగతి విద్యార్థులకు మొదటిసారి రాసే కామన్ ఎగ్జామ్ కు విద్యార్థులలో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు పదో తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు పెట్టడం అభినందనీయమన్నారు. ఈ పరీక్షలు పదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఇప్పటివరకు ఎంత చదివాము ఇంకా ఎంత కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని నెరవేరెందుకు కృషి చేయాలని ఇలాంటి ప్రతిభా పరీక్షలను సద్వినియోగం చేసుకోవడం వల్ల విద్యార్థులకు ఒక ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుతుందని అన్నారు. భవిష్యత్తులో జరిగే పదో తరగతి విద్యార్థుల కామన్ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంతో పరీక్షలను రాసి ఉన్నత స్థానాలకు ఎదగాలని కష్టపడి రాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలవాలంటే బాగా చదివి ఉన్నత స్థానంలో ఎదిగినప్పుడే విద్యార్థులు చదివిన చదువుకు ఫలితం ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ యొక్క పరీక్షను ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు హాజరై జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షను విజయవంతం చేయాలనికొరారు. ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ని అభినందించారు.
అనంతరం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మం పాటి శంకర్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పదో తరగతి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసెందుకు ఈ పరీక్షను ఉపయోగపడుతుందని అన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలు మండల కేంద్రాల్లో ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విద్యార్థులు 30 రూపాయల ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. నియోజకవర్గ స్థాయి, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య నల్గొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.ఏ సైఫ్,మారుపాక కిరణ్, స్పందన,సిరి ,సాయి, ప్రణవి తదితరులు ఫాల్గున్నారు.