మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ.
– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ.
Classification SC : ప్రజా దీవెన శాలిగౌరారం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్ని ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ అన్నారు.
శాలి గౌరారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇంచార్జి బోడ సునీల్ మాదిగ ఆద్వర్యంలో గత 5 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షలకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ జరిగితే మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.ఎస్సీ రిజర్వుడు కేటగిరిలోని ఉద్యోగాలన్ని ఏక పక్షంగా మాలలకే చెందే అవకాశం ఉందని అన్నారు.ముప్పై ఏళ్ల పోరాటంలో ఉన్న న్యాయాన్ని సుప్రీం కోర్టు గుర్తించి తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు తగిన న్యాయం చేసే విధంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.విద్యా ఉద్యోగ రంగాల్లో న్యాయం చేయడం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత అని అన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా ముప్పై ఏళ్లుగా శాంతియుతంగా నడుస్తున్న పోరాటం ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే అని ,ప్రస్తుతం ఈ పోరాటం విజయానికి చేరువైందని అన్నారు మంద కృష్ణ మాదిగ లేకుంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం లేదని అన్నారు. కనుక ఎస్సీ వర్గీకరణ ఫలితం మంద కృష్ణ మాదిగకే చెందుతుందని అన్నారు.కేవలం మాదిగల కోసమే కాకుండా అన్ని ఎస్సీ కులాలకు న్యాయం జరిగాలనే వర్గీకరణ పోరాటం జరిగిందని అన్నారు.ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు తమ ఉద్యమ ఆగదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జీ కారుపాటి అంబేద్కర్, బట్ట శ్రీను,బట్ట సైదులు, మొలుగూరి సోమయ్య, అయిలపాక శ్రీను,మామిడి రమేష్, గద్దపాటి అరవింద్, పెడ్యాల వెంకన్న, బట్ట తిరుమలేష్,వేముల సోమయ్య, బట్ట సైదులు,వేముల శ్రీకాంత్, బొడ్డు ఉపేందర్,మాగి వెంకటేష్, గుండ్లపల్లి వర ప్రసాద్,బట్ట వెంకన్న,ఎర్ర మల్లేష్ మాదిగలు తదితరులు పాల్గొన్నారు