CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీ గా మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్య మ ని, అదికూడా వచ్చే పదేళ్లలోనే సా కారం చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ లో నే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కేం ద్రంగా హైదరాబాద్ మారింద న్నా రు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే బయో ఆసియా సద స్సు 2025 ను ఆయన లాంచనం గా ప్రారంభించారు. అనంతరం మా ట్లాడుతూ హైదరాబాద్‌లో ఫ్యూచ ర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామ న్నారు. దేశంలోనే ఎక్కువ పెట్టుబ డులు ఆకర్షించే రాష్ట్రంగా తెలంగా ణ మారిందన్నారు. ఉద్యోగాలు, ఉ పాధి కల్పనలో మిగతా రాష్ట్రాల కంటే మనం ముందున్నామని, హై దరాబాద్‌కు వచ్చే కంపెనీల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పారు.హైదరాబాద్ వేదిక గా ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ మారిందని, హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించటం తో పాటు ప్రపంచానికి మార్గదర్శ నం చేసే కార్యక్రమంగా బయో ఏషి యా దేశ విదేశాలను ఆకర్షిస్తోంద న్నారు. ప్రపంచంలో పేరొందిన ఫా ర్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్ మరియు బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నా యన్నారు. ముందునుంచీ పరిశోధ నలు, కొత్త ఆవిష్కరణలను అం దించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో మా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
మేం ఇంతకా లం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టామని, ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రం గాల్లో శాస్త్ర నిపుణులు, ఇంజనీర్ల సమూ హాన్నీ తయారు చేశామ న్నారు. జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 10 సంవ త్సరాలలో తెలంగాణను ఒక ట్రిలి యన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టు కున్నామన్నారు.హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియా సేవల రంగా నికి ప్రాధాన్యమిస్తామని , హైదరా బాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేప డుతున్నామని వెల్లడించారు. ఇ ప్పుడు దేశంలో హైదరాబాద్ ఎల క్ట్రిక్ వాహనాల రాజధానిగా అవ తరించిందని, దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇక్కడ జరుగుతున్నాయన్నారు. 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ లో ప్రవేశపెడుతున్నామని, కోర్ సిటీ వెలుపల అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మాన్యుఫాక్షరింగ్ హబ్ అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచం లోని అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా దీన్ని నెలకొల్పుతామని, చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తాం అ ని వివరించారు. హైదరాబాద్ ప్రపంచం నలుమూలాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని , ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ ఈ రెండు రింగ్ లను రేడియల్ రోడ్లతో అను సంధానిస్తామని ప్రకటించారు. ఈ రహదారులకు ఇరువైపులా క్లస్ట ర్లను అభివృద్ధి చేస్తామని, తెలంగా ణ భూపరివేష్టిత రాష్ట్రంగా ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయా లు మెరుగుపరుస్తామని సీఎం చెప్పారు.
బయోసైన్సెస్, బయోటె క్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచం లోనే అత్యుత్తమ పర్యావరణ వ్య వస్థకు చిరునామాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. ఆవిష్కర ణలు, పరిశోధన, అభివృద్ధి, త యారీ, నైపుణ్యాల కేంద్రంగా అభి వృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు. నిన్ననే హైద రాబాద్‌లో అమెజాన్ సంస్థ తమ కార్యకలాపాలను విస్తరించిందని, ఇది మా సహకారానికి నిదర్శన మని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, మా ప్రభు త్వ సహకారాన్ని అందుకోవాలని, మాతో భాగస్వామ్యం పంచుకోవా లని ప్రపంచస్థాయి దిగ్గజ కంపనీ లన్నింటినీ ఆహ్వానిస్తున్నామ న్నా రు.సులభమైన పారిశ్రామిక విధా నం, మౌలిక సదుపాయాలు, ఆశిం చినంత మద్దతు అందించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇక్కడ అ త్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉ ద్యోగాల కల్పన ఉంది. ఇటీవల దా వోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేది కలో తెలంగాణ రూ.1.8 లక్షల కో ట్ల పెట్టుబడులు సాధించింది. విభి న్న రంగాలలో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. గత ఏ డాది లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.4 0,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించామ న్నారు. దాదాపు 150పైగా ప్రాజెక్టు ల్లో ఈ పెట్టుబడులు విస్తరించాయ ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.