Congress Party Harish :ప్రజా దీవెన ,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ప్రదేశ్ కాం గ్రెస్ కమిటీ క్రమశిక్షణ సంఘం అ ధ్యక్షులు చిన్నారెడ్డి నిన్న రోజున వనపర్తిలో ఆవేదనతో చేసిన వ్యా ఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ త్వానికి, ప్రజాస్వామ్యం ఖూనీ అ వుతోన్న విధానానికి అద్దం పడు తోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి
ఇందిరమ్మ రాజ్యం కాస్తా పోలీసు రాజ్యమైందని, మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణ మైపోయాయన్న మా ఆరోపణలు నూటికి నూరు శాతం వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమవు తోoదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల తీరు మాటల్లో రా జ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణ లా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆ యన మీడియాకు చిట్ చాట్ చేశా రు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వంపై హరీష్ రావు సెటైర్స్ దాడి చేశారు. హరీష్ రావు చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే.
‘‘పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారుల్లాగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే కేసు పెట్టు మంటే పెట్టాలె, తీసేయమంటే తీసేయాలె అనే స్థాయికి దిగజా రారు. గతంలో ఎన్నడూ ఒక ఎమ్మె ల్యేకు అధికారులు ఇంతగా భయ పడిన దాఖలాలు లేవు. నా 46ఏం డ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా పోలీసులు, అధికారు లు ఎన్నడూ ప్రవర్తించలేదని చిన్నా రెడ్డి బహిరంగంగా ప్రభుత్వ తీరు ను ఎండగట్టారు. కొందరు పోలీసు లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా రని బీఆర్ఎస్ పార్టీ ముందు నుం చి చెబుతున్నది నిజమేనని నాడు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నేడు వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ ప్రభుత్వంలో పోలీసులు, అధి కారుల తీరు ఇట్లా ఉంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నోట్ల రాజకీ యం నగ్న తాండవం చేస్తున్నది. ఈ విషయాన్ని కూడా చిన్నారెడ్డి గారే స్వయంగా వెల్లడించారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖ ర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీ టీసీలకు 5నుంచి 10లక్షల వరకు ఇస్తామని హామి ఇచ్చి, రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చారని చిన్నా రెడ్డి బట్టబయలు చేసారు.
ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నిక ల్ కమిషన్లు ఎందుకు ఈ విష యం పై నోరు మెదపడం లేదు, సుమో టోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు,బీఆర్ఎస్ నాయకు లపై నిరాధారమైన కేసులు పెట్ట టంలో చూపించే అత్యుత్సాహం ఆధారాలున్నా, స్వయంగా క్యాబి నెట్ ర్యాంకులో ఉండి, ప్రభుత్వం లో ఉన్న కాంగ్రెస్ నాయకుడే చెబు తున్నా ఎందుకు పెట్టడం లేదు?
కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదే నా?.రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు?. బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సా క్ష్యం ఏం కావాలి? బిజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తు న్నాం. ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నికల్ కమిషన్లు ఎందుకు ఈ వి షయంపై నోరు మెదపడం లేదు?
మంత్రి పొంగులేటి ఇంటి పైన ఈడి రైడ్ ఐతే ఈడి ఒక నోటీస్ ఇవ్వ లేదు.సుమోటోగా తీసుకొని కేసు లు ఎందుకు పెట్టడం లేదు?
కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా?
రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమ ర్థి స్తారు? ఏం సమాధానం చెబు తా రు?బడే భాయ్, ఛోటే భాయ్ బం ధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కా వాలి? బిజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
‘‘పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారుల్లాగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే కేసు పెట్టు మంటే పెట్టాలె, తీసేయమంటే తీసేయాలె అనే స్థాయికి దిగజా రారు. ఈ ప్రభుత్వంలో పోలీసులు, అధికారుల తీరు ఇట్లా ఉంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నోట్ల రాజకీయం నగ్న తాండవం చేస్తున్నది. ఈ విషయాన్ని కూడా చిన్నారెడ్డి గారే స్వయంగా వెల్లడించారు.
ఎల్ ఆర్ ఎస్…బీఆర్ఎస్ హాయంలో ఎల్ ఆర్ ఎస్ చేపడితే భట్టి, ఉత్తం, సీతక్క, కోదండరాం లు పేద ప్రజల రక్తం తాగే స్కీం అ న్నారు. జనాలను రెచ్చగొట్టారు. మేం అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తాం అన్నారు.అధికారంలోకి వచ్చి న తర్వాత ఫీజులు పెంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తు న్నారు.కోదండరాం ఉచితంగా చే స్తాం అని చెప్పారు ఇపుడు ఎం దుకు మాట్లాడరు.వివిధ శాఖల అధికారులు సమన్వయంతో డబ్బ లు పిండటం లేదని అధికా రుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒంటి కాలి మీద లేస్తున్నారు.
•ఆషా డం సేల్, దిపావళి బొనాం జ, దంతేరస్ ఆఫర్ల మాదిరిగా డి స్కౌంట్లు ప్రకటిస్తున్నారు. చూడ బోతే ప్రైజులు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు, లక్కీ డ్రాలు కూడా ప్రక టిస్తారేమో ప్రజలు స్టేట్స్ మెన్ కావాలనుకున్నారు. కాంగ్రెస్ వాళ్లు సేల్స్ మెన్లుగా తయారయ్యారు.
ముందు అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ అన్నారు. ఇప్పుడు 25శాతం డిస్కౌంటహో అని జేబులు ఖాళీ చేసే ప్రణాళిక వేస్తున్నారు.ఫ్రీ అని చెప్పి చారాణా డిస్కౌంట్ ప్రకటిస్తూ మోసం చేస్తు న్న రేవంత్ ప్రజలు రేపు నీకు సీట్ల లో 75శాతం భారీ డిస్కౌంట్ ఇస్తరు.కాంగ్రెస్ లో నువ్వు మి స్కౌంట్ ముఖ్యమంత్రిగా మిగిలి పోతావు. ప్రజలారా గతంలో మీరు ఎల్ ఆర్ ఎస్ ఫీజులు కట్టకపోతే 25శాతం డిస్కౌంట్ కు దిగారు.
ఇప్పుడు కూడా మీరు కట్టకుండా వాగ్దానం ప్రకారం ఫ్రీ గా చేయాలని డిమాండ్ చేయండి. ప్రజలు ఎల్ ఆర్ ఎస్ కట్టకండి. చచ్చినట్లు ఫ్రీగా చేయాల్సి వస్తుంది.ఇటీవల ఒక ది న పత్రిక ఎడిటర్ ఇప్పుడు తెలం గాణనే ఢిల్లీ కాంగ్రెస్ ను సాదాలె అని వ్యాఖ్యానించాడు.తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్ ను సాదాలంటే గల్లీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని బా దాలె.ఇదే నడుస్తున్నది. ఈ మధ్య కప్పం ఢిల్లీకి తీసుకుపోయే వైశ్రా యిని కూడా మార్చారు. భట్టి, ఉత్తం, సీతక్క, కోదండరాంలు పేద ప్రజలకు క్షమాపణ చెప్పండి.
ఎస్ ఎల్ బీ సీ…..ఎస్ ఎల్ బీ సీ ఘటన చాలా బాధ కల్గించింది. 8 మంది కార్మికుల గురించి వారి కు టుంబాల గురించి ఆలోచిస్తే చాలా ఆవేదన కలుగుతున్నది. ఇటువం టి దురదృష్టకర సంఘటన మీద కూడా కాంగ్రెస్ నాయకులు కుటిల రాజకీయ వ్యాఖ్యలు చేయడం మనస్తాపం కల్గించింది.
• ఘటన జరిగిన తర్వాత మేం చాల సమన్వయంగా వ్యవహ రించాం.కానీ కాంగ్రెస్ నాయకులు వికృతమైన రాజకీయ వ్యాఖ్యా నాలు చేస్తూ మేం స్పందించక జవా బివ్వక తప్పని అనివార్యతను సృ ష్టించారు.పదేండ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ కూడా తవ్వలేదని ఉత్తం కుమార్ రెడ్డి ఎలా అబద్దాలు చెబుతాడు. అ త్యంత సంక్లిష్టమైన ఎస్ ఎల్ బీ సీ సొరంగాన్ని 11.48 కిలోమీటర్లు తవ్వినమనేది రికార్డెడ్ ట్రూత్.
నాతో పాటు ఎస్ ఎల్ బీ సీ సొరంగానికి వచ్చిన ఆనాటి సహచర మంత్రి జూపల్లి కృష్ణా రావు కూడా తానా అంటే తందాన అని అబద్దాలాడుతున్నడు. అం దుకనే మేం మాట్లాడవల్సి వస్తు న్నది.2005 నుంచి 14 మధ్య కాం గ్రెస్ 3,300 కోట్లు ఖర్చు పెడితే, 20 14 నుంచి 2023 మధ్య బిఆర్ ఎస్ 3,900 కోట్లు ఖర్చు పెట్టింది.
అసెంబ్లీలో ఆనాడు జానా రెడ్డి కోర్తే ఎస్ ఎల్ బి సి పనులు ప్రారంభిం చేందుకు రూ. 100 కోట్లు కేసీఆర్ ఇచ్చి జానారెడ్డి మాటలు గౌరవిం చారు.కాళేశ్వరం ప్రాజెక్టులో 230 కిలోమీటర్లు టన్నెల్ తవ్వి పూర్తి చేసాం. ఎస్ ఎల్ వి సెట్ అన్నలతో అనేక సాంకేతిక సమస్యలు ఎదు రైనా 12 కిలోమీటర్లు బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎస్ ఎల్ బి సి కింద రెండు బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్లు లో 90% శాతం పూర్తి చేసాం. మంత్రి హోదాలో ఉండి అబద్ధాలు మాట్లాడితే ప్రజల్లో విశ్వాసం నమ్మకం కోల్పోతారు.
కాళేశ్వరం పిల్లర్లు కుంగితే నానా యాగి చేసారు.కాలేశ్వరం అంటే 3 బ్యారేజీలు ,15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్ లో ,21 పంప్ హౌస్, 203 కిలోమీటర్ల టన్నల్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ లు,98 కిలోమీటర్ల ప్రెజర్ మెన్,141 ఎంసీ ల నీటి సామర్థ్యం. 530 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేయడం. వీటన్ని సమాహారమే కాలేశ్వరం
కాలేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒ క్క బ్లాకు పిల్లర్ కుంగితే నానా యాగి చేశారు.కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన 14 నెలల్లో ఖమ్మం లో పెద్ద వాగు ప్రాజెక్టు కొట్టుకుపో యింది.సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలింది. ఇప్పటివరకు ఇలాంటి చర్యలు లేవు.పాలమూరు ప్రాజె క్టులోని వట్టెం పంప్ హౌజ్ నీట మునిగింది. ఎల్ ఎల్ బీ సీ పరిస్థితి చూస్తున్నాం. కాళేశ్వరం విషయం లో వారం రోజుల్లోనే రిపోర్టు తయా రు చేసిన ఎన్డీఎస్ఏకు ఎస్ ఎల్ బీ సీ, తదితర ఘటనలు కనిపించడం లేదా? విచారణ ఎందుకు చేయ డం లేదు, నివేదికలు ఎందుకు ఇవ్వడం లేదు.qఎస్ ఎల్ బి సి ఘటన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధారణ లీకేజీ ప్రకృతి విపత్తి అని మాట్లాడారు. మరి కాలేశ్వరం విష యంలో ఈ ప్రకృతి విపత్తి ఎక్కడికి పోయి. ఎందుకు కాలేశ్వరంలోని మెడిగడ్డ మ్యారేజ్ రిపేర్ చేపిం చడం లేదు. ఎన్డీఎస్ఏ ఎందుకు విచారణ చేపట్టడం లేదు బిజెపి కాంగ్రెస్ చీకటి ఒప్పందం వల్లనే మౌనంగా ఉన్నారా. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ల మధ్య కొనసాగుతు న్న పరస్పర అవగాహన వల్లనే కాంగ్రెస్ తప్పిదాలు చూసిచూడన ట్లు వదిలేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు నాన్ కాంగ్రె స్, నాన్ బిజేపీ అభ్యర్థులలో మెరు గైన అభ్యర్థికి ఓటేసి ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నాం.నిజామాబాద్ స భలో ముఖ్యమంత్రి మాటల్లో ఓట మి భయం స్పష్టంగా బయటపడిం ది.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గ్రాడ్యు యేట్ ఓటర్లను కించ పరిచేలా ఉ న్నాయి.ఎవరైనా నాయకుడు అప్పీల్ చేస్తే మీ ఓటు మాకు చాల విలువైనది. ఈ గెలుపు మాకు కీలకమైనది. అంటారు.కానీ సీఎం రేవంత్ రెడ్డి గెలిచినా గెలవకున్నా ఫరక్ పడదు అన్నడు. అంటే మీరు ఓటేసినా వేయకున్నా ఫరక్ పడద ని చెప్పినట్లే కదా వానాకాలం రైతు బంధు పైసలు ఖాతాల్లో పడ్డవాళ్లు కాంగ్రెస్ కు ఓటు వేయండి, పడని వాళ్లు కాంగ్రెస్ ను ఓడించండి. ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు పొం దిన యాజమాన్యం, సిబ్బంది కాంగ్రె స్ కు ఓటు వేయండి, పడని వాళ్లు ఓడించండి.కల్యాణలక్ష్మి, తులం బంగారం పొందిన గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ కు ఓటు వేయండి, రాని వాళ్లు ఓడించండి.ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు వచ్చి ఉంటే గ్రా డ్యుయేట్స్ కాంగ్రెస్ కు ఓటు వే యండి, రానట్లయితే ఓడించండి. బీఆర్ఎస్ హయాంలో లక్షా 60వేల ఉద్యోగాలు ఇచ్చినం. కాంగ్రెస్ ఇ చ్చామని చెబుతున్న 55వేల ఉద్యోగాల్లో 5వేలు మినహా మిగతా 50వేలు బీఆర్ఎస్ హాయంలో ఇచ్చినవే.మేనిఫెస్టోలో చెప్పినట్లు వెంటనే పెండింగ్ డీఏలు, ఆరు నెలల్లో పీఆర్సీ వచ్చి ఉంటే ఉద్యో గస్థులు, టీచర్లు, కాంగ్రెస్ కు ఓటు వేయండి లేకుంటే ఓడించండి. ప్రి యాంక గాంధీ హామి ఇచ్చిన విధం గా నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే నిరుద్యోగులు కాంగ్రెస్ కు ఓటు వేయండి లేదంటే ఓడించండి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు బుద్ధి చెప్పాలి…..ఆంధ్ర, బిహార్ రాష్ట్రాలకు నిధుల వర్షం కురిపించి తెలంగాణకు మొండి చెయ్యి చూ పించిన బిజేపీకి మేధావులైన గ్రా డ్యుయేట్లు, టీచర్లు బుద్ధి చెప్పాలి.
దేశంలో 156 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వని బిజే పీకి తెలంగాణ బిడ్డలు ఓటేస్తే అ న్యాయాన్ని ఆమోదించడమే ఆ లోచించండి.పసి పిల్లలు తాగే పాల నుంచి పాప్ కార్న్ దాకా జీఎస్టీ వేసి నిత్యావసర వస్తువుల ధరలు పెరి గేలా చేస్తూ పేద ప్రజల మూలుగు లు పీలుస్తున్న బిజేపీకి బుద్ధి చె ప్పండి.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 ఏండ్లలో డాలర్ వి లువ 64 నుంచి 88కి పెరిగింది. ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత బిజేపీది కాదా అని ప్రశ్నించారు.