Constable Suicide Attempt: ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెం: గతంలో గంజాయి (Marijuana) కేసులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ (Constable) తాజాగా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం (Suicide attempt) చేసుకున్నాడు. సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలువురు ఎస్సైలు పేర్లు సూసైడ్ వీడియోలో వెల్లడి చేసిన కానిస్టేబుల్ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలంలో గంజాయికి సంబంధించిన కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపణలు చేస్తూ సూసైడ్ వీడియో కానిస్టేబుల్ రిలీజ్ చేశాడు.
బూర్గంపహాడ్ లో బడాబాబులు హస్తం గంజాయి రవాణాలో ఉన్నట్లుగా వీడియోలో వివరాలు వెల్లడి. హాట్ టాపిక్ గా కొనసాగుతున్న కానిస్టేబుల్ సూసైడ్ వీడియో (Suicide video) పలువురు బిఆర్ఎస్ నాయకులు, పోలీసు వారు అండదండలతో గంజాయి దందా సాగినట్లు తనను అన్యాయంగా ఇరికిచ్చినట్లు వీడియోలో వెల్లడి చేసిన కానిస్టేబుల్, ఆ తర్వాత విషమంగా కానిస్టేబుల్ పరిస్థితి నెలకొంది. మెరుగైన వైద్యానికి తరలించినట్లు సమాచారం.