Deadly Gangrene: పేగుల్లో గాంగ్రీస్ ప్రాణాంతకం.. రోగి ప్రాణాలను కాపాడిన యశోదా హాస్పిటల్ వైద్యబృందం..
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:
Deadly Gangrene: చిన్న పేగులో గాంగ్రీన్… దీన్నే వైద్య పరిభాషలో బవెల్ ఇన్‌ఫార్క్‌షన్ (Bowel infarction) అంటారు. పేగులో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడంవల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. దీనివల్ల తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సోకుతున్న నేపథ్యంలో కొన్ని కేసుల్లో ఇది మలమూత్రాదుల స్తంభనకు మాత్రమే కాక మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ (Multiple organ failure)కి కూడా దారి తీస్తుందని హైదరాబాద్ మలక్‌పేట యశోద హాస్పిటల్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్ (Surgical Gastro Intestinal Surgeon) డాక్టర్ సాయిబాబు (Dr. Saibabu) అన్నారు.
ఆయన ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సరైన సమయంలో సరైన చికిత్స అందకపోతే రోగి ప్రాణాలు పోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యాధికి సంబంధించి ఇంటెస్టినల్ గాంగ్రీన్ పెర్పొరేషన్ పెరిటోనిటిస్- సివియెల్ సెప్సిస్‌తో బాధపడుతున్న నల్లగొండ పట్టణానికి చెందిన వెంకట్ రెడ్డి 51 సంవత్సరాల ఓ వ్యక్తిని యశోదా హాస్పిటల్ ( Yashoda Hospital) అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఎమర్జెన్సీ కేర్ కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అప్పటికి ఉన్న స్థితిలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ ద్వారా ఆ వ్యక్తికి ఏ క్షణానైనా మరణం సంభవించవచ్చనే పరిస్థితిలో రోగికి అత్యాధునిక శస్త్ర చికిత్స చేసి, ఐసీయూకు తరలించి, వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తూ, డయాలసిస్ చేస్తూ అత్యవసర సేవల విభాగంలో అత్యంత శ్రద్ధతో వైద్యం చేసి ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు.
మల్టీ డిసిప్లినరీ సమర్థులైన వైద్యుల బృందం ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఆ రోగికి శస్త్ర చికిత్స చేసి, అనంతరం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో అత్యాధునిక వైద్య సేవల్ని అందించి, రోగి ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. యశోదా మలక్ పేట్ అత్యవసర వైద్య సేవల విభాగానికి వచ్చే సరికి రోగి భరించలేని పొట్ట నొప్పితో మెలికలు తిరుగుతూ కేకలు పెడుతున్నాడని, వాంతులు చేసుకుంటూ ఊపిరి అందని స్థితిలో కొట్టుమిట్టాడుతు మూడు రోజులుగా మూత్ర విసర్జన బాగా తగ్గిపోయిందన్నారు.
మొదట అతన్ని స్థానిక ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న ఆ రోగిని స్థానిక ఆసుపత్రి వైద్యుల సలహాతో వెంటనే హైదరాబాద్ మలక్ పేటలోని యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చాక యశోదా ఆసుపత్రి వైద్యబృందం వెంటనే అతన్ని అత్యవసల సేవల విభాగంలో చేర్చుకుని రోగిని ఆగమేఘాలమీద ఎక్స్ పరేటరీ లాబ్రెక్టమీ ద్వారా చిన్న పేగుకు ఆపరేషన్ చేసి శస్త్ర చికిత్స తర్వాత ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చి, డయాలసిస్ (Dialysis) చేస్తూ మల్టిపుల్ డిసిప్లినరీ వైద్య సేవల్ని అందించి అతని ప్రాణాలను నిలబెట్టి రోగి ఆరోగ్యం చక్కబడ్డాక ఆసుపత్రినుండి డిశ్చార్జ్ చేశామన్నారు. నిపుణులైన యశోదా ఆసుపత్రి వైద్య బృందం సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు, యశోదా ఆసుపత్రి అందిస్తున్న అంతర్జాతీయ స్థాయి అత్యాధునికమైన వైద్య సేవలకు ఈ కేసు కూడా మరో చక్కటి ఉదాహరణ గా పేర్కొన్న ఆయన హైదరాబాద్ మలక్ పేట యశోదా ఆసుపత్రిలో మాత్రమే కాక యశోదా ఆసుపత్రి అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన యశోదా వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్టతరమైన జబ్బులు, వ్యాధులకు కూడా చికిత్స జరుగుతోందని డైరెక్టర్ గోడుకంటి పవన్, యూనిట్ హెడ్ కె.శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ చిదుర తెలిపారు. మరింత సమా చారం కోసం ఎ. వాసుకిరణ్ రెడ్డిని 9705771230/9949998378 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.