District Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పేద ప్రజల కు 24 గంటలు వైద్య సేవలు అంది స్తున్న నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆ సుపత్రి డాక్టర్లు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కొన్ని కేసుల విష యంలో రోగులు, వారి సహాయకు లు డాక్టర్లను, సిబ్బందిని పరుష పదజాలంతో దూషించడం వంటి సంఘటనలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా కాకుండా డాక్టర్లను ఇబ్బంది పెట్టవద్దని ఆమె కోరారు .గతంతో పోలిస్తే నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు.
మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ తో కలిసి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాత, శిశు సంరక్షణ విభాగం, ఇతర విభాగా లను తనిఖీ చేశారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడు తూ నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యా లు ఉన్నాయని ,అంతేకాక సమర్థ వంతులైన డాక్టర్లు ఉన్నారని, 24 గంటలు కాకుండా 48 గంటలు నిరంతరం పనిచేసేందుకు ఇక్కడ డాక్టర్లు సంసిద్ధులుగా ఉన్నారని అన్నారు. అంతేకాక ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉంటు న్నారని, సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారని, రేడియాలజిస్ట్ ను కూడా డిప్యూటేషన్ పై తీసుకోవ డం జరిగిందని, హైదరాబాద్, రం గారెడ్డి జిల్లాలో ఉన్నంత మంది సిబ్బంది ఇక్కడ నియమించడం జరిగిందని తెలిపారు. అపారమైన సేవలు అందిస్తున్న డాక్టర్లకు, సి బ్బందికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని కేసుల విష యంలో డాక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు జరిగా యని, అవి దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్ పి తోపాటు, ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు. ఎవ రూ చట్టాన్ని వారి చేతిలోకి తీసు కోవద్దని, ప్రభుత్వ ప్రధాన ఆసుప త్రిలో జరుగుతున్న సంఘటనల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తం గా ఉందని, విషయాన్ని అతి సూ క్ష్మంగా పరిశీలిస్తున్నామని తెలి పారు.
గడచిన ఆరు నెలల నుండి ఆసుపత్రిలో చాలా మార్పులు వ చ్చాయని, అందువలన ప్రజలు సంఘ వ్యతిరేక శక్తుల ప్రోత్సాహం తో ఎలాంటి దురుసు ప్రవర్తనకు పాల్పడకుండా,డాక్టర్లకు ,సిబ్బందికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చే శారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ కొంతమంది కావాలని డాక్టర్లను, సిబ్బందిని వేదిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని, అలా చేయవద్దని ఆయన కో రారు. దేవరకొండలో సైతం ఇ లాం టి సంఘటన జరిగిన సందర్భంగా కేసులు నమోదు చేయడం జరిగిం దని, నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆ స్పత్రిలో కావాలని రెచ్చగొట్టి దాడు లు చేసే వారిని గుర్తించి వారిపై కే సులు నమోదు చేస్తామని తెలి పారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం, అలాగే ప్రభుత్వ సంస్థ ల్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనల ప్రకారం నడుచుకో వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేయాల్సిన సెక్యూరిటీ పై సమీక్షించడం జరిగిందని, ఇదివరకే ప్రభుత్వాసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్టు నిర్వహిస్తున్నామని తెలిపా రు. రోగులతో వచ్చిన వారు కాకుం డా బయట వ్యక్తులు ఒక గుంపుగా వచ్చి ఇబ్బందులు పెట్టేందుకు ప్ర యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ,ఇకపై ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిఘాను తీవ్రతరం చే స్తామని ,ఎవరైనా డాక్టర్లు, సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆ యన కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివా స్, డిసిహెచ్ఎస్ మాతృ నాయక్, జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రి సూ పరింటిండెంట్ అరుణ శ్రీ ,డాక్టర్లు తదితరులు ఉన్నారు.