Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Tripathi : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27న ప్రత్యేక సాధారణ సెలవు

District Collector Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 27 న జరగనున్న వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించు కునేందు కుగాను,ఈ నెల 27న ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, మరియు వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాటి ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో రిజిస్టర్డ్ ఓటర్లకు ఇది వర్తిస్తుందని, వారు ఓటు వేసేందుకు గాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ రోజున(27.2.2025) ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తున్నట్లు తెలిపారు .

అందువల్ల వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ నియోజ కవర్గం పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నల్గొండ మహాత్మా గాంధీ యూని వర్సిటీ ,అలాగే జిల్లా ఇంటర్మీ డియట్ విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వారి వారి ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఆమె కోరారు.