–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi :ప్రజా దీవెన, నల్లగొండ: మహిళలు చదువుకుంటే ఏదైనా సాధిస్తారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు చదువు కోవాలని, ఐకమత్యంగా ఉండాలని ఆమె అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ టైలరింగ్ లో శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు.
ఇంటి పనులు చేస్తూ టైలరింగ్ నేర్చుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. కుటుంబంలో మహిళలు బాగా చదువుకుంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతా యని వయసుతో చదువుకు సంబంధం లేదని ,పెద్ద పెద్ద కంపెనీలు నిర్వ హించేవారు సైతం 50 సంవత్స రాల తర్వాత చదువుకొని కంపె నీలను ప్రారంభించి సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని పైకి ఎదగా లని చెప్పారు.ఇది చదువుద్వా రానే సాధ్యమ వుతుందని అన్నా రు.ఇందుకు పుస్తకాలను బాగా చదవాలని, తాను సైతం తెలం గాణ ఉద్యమంపై అవగాహన కోసం అనేక పుస్తకాలు చదివానని తెలిపారు.
కాగా దుర్గాభాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలు కుట్టు మిషన్లు నేర్చుకునేందు కుగాను మిషన్లు లేవని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, 30 మందికి కుట్టు మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుం టానని కలెక్టర్ తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, తదితరులుఉన్నారు.