Fraud : ప్రజా దీవెన సూర్యాపేట: సూర్యా పేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఎస్ కుమార్ అనే వ్యక్తి పది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆయన పేరు మీద అప్పటికే వస్తున్న వృ ద్ధాప్య పింఛన్ ను నిబంధనల మేరకు తొలగించకుండా యధావిధి గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య తమకు డబ్బులు ఇవ్వాలని పట్టుపట్టడంతో అధికారులు నిరాక రించారు. ఈ విషయమై ఆమె పో లీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి న ట్టు తెలుస్తుంది. పది నెలల డబ్బు లు ప్రభుత్వానికి జమ చేయకుండా అతని భార్యకు కూడా ఇవ్వకుండా అధికారులే నొక్కేశారని ఆరోపణ లు ఉన్నాయి.
చివరికి పెద్ద మను షులు,రాజకీయ నాయకుల వద్దకు చేరింది. వారు పంచాయతీ పెట్టి ఒక తీర్మానం చేసినట్లు సమాచా రం. ఇలాంటి పింఛన్లు ఇంకా చాలా ఉన్నట్లు పలువురు గుసగుసలాడు కుంటున్నారు. మంత్రి ఇలాకాలో పోస్టల్ అధికారుల మొండి ధైర్యం తో వృద్ధప్య పెన్షన్లు గోల్ మాల్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ అధికారులు చూసి చూడన్నట్లు ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా అధికా రు లు చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎ త్తున అవినీతి జరుగుతుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు .