Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Medical Camp for Journalists: జర్నలిస్ట్‌లకు మెగా వైద్య శిబిరం

— ప్రారంభించిన ఎమ్మెల్యేలు అరికె పూడి గాంధీ, మాధవరం కృష్ణారావు

ప్రజా దీవెన, కూకట్ పల్లి:

Medical Camp for Journalists: కూకట్ పల్లిలోని రాందేవ్ రావు ఆసుప త్రిలో విలేకరులకు వారి కుటుంబ సభ్యులకు ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబి రాన్ని పిఏ సి చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికేపూడి గాంధీ, కూకట్ పల్లి శాసనసభ్యులు మాధ వరం కృష్ణారావు, కూకట్ పల్లి కాం గ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, బీజేపీ కూకట్ పల్లి ఇంచార్జి మాధ వరం కాంతారావు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరహత్ అలీ, జనసేన కూకట్ పల్లి ఇంచార్జి ప్రేమా కుమార్ లు వివిధ విభాగా లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ఉరుకులు పరుగులతో ఉండే జ ర్నలిస్టులు, వారి కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోని వైద్య పరీక్ష లు చేయించడం అభినందనీయమ ని అన్నారు. రాందేవ్ రావు అస్పత్రి నిర్వాహకులు చేపట్టిన కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. జర్నలిస్టులు సమాజ భద్రత కోస మే పనిచేస్తే విలేకరుల ఆరోగ్యాల కోసమే రాందేవ్ రావు అస్పత్రి విలేకరుల కోసం పాటుపడు తుం దన్నారు. క్యాంపు లో జరుగుతున్న పరీక్షల గురించి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కమలాకర్, సీఈఓ డాక్టర్ యోబు లు వివరించారు. ఈ సందర్బంగా వివిధ రక్త పరీక్షలు, కిడ్నీ, గుండె, లివర్, షుగర్, ఎముకల పరీక్షలతో పాటు

డైబెటిక్ నీరోపతీ, ఫుట్ హెల్త్ కేర్ పొడియటరీ, ఎముకల సాంద్రత, కళ్ల, డెంటల్ పరీక్షలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో సుమారు 300 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పరిశీలించి తగిన సలహాలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావ్ పరిశీలించారు. ఈ క్యాంపు లో విక్రందేవ్ రావు , మీరా రావ్ , ప్రశాంత్ రెడ్డి, అపర్ణ రావ్ లు పర్యవేక్షణ చేశారు. శిభిరాన్ని ప్రముఖ రేఖి థెరపీ గ్రాండ్ మాస్టర్ లక్ష్మి కమలాకర్ క్యాంపు ని పరిశీలించి, ఆసుపత్రి అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమం లో టియుడబ్యూజె మేడ్చెల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం ఏ కరీం, జర్నలిస్ట్ లు నవీన్ రెడ్డి, మాణిక్య రెడ్డి, నాగరాజు, రాహుల్, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.