Honor For Lawyer: కోదాడ సబ్‌కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది సిలివేరు వెంకటేశ్వర్ల (Senior Advocate Siliveru Venkateswarlu)కు కుమ్మరి కులస్తులు పలువురు అధికారులు కలిసి వారి నివాసంలో ఘన సన్మానం (Honour) కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వారి నివాసంలో చలిగంటి రామారావు అధ్యక్షతన ఏర్పాటు సన్మాన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యం లాంటివారు సిలివెరు వెంకటేశ్వర్లు అన్నారు. అనేకమందితో పోటీపడుతూ అడిషనల్ పీపీగా పదవి అధిరోహించడం సంతోషకరమన్నారు. ఇంకా అనేక ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.
అడిషనల్ పిపి సిలివేరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నాకు సహకరించిన మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy)కి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శాలివాహన సంఘం నాయకులు పలువురు అధికారులు నాయకులు అడిషనల్ బీపీ సిలివర్ వెంకటేశ్వర్లు వాణీ దంపతులను శాలువాలు, పూలమాలలతో, బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మామిడి రామారావు, చలిగంటి నర్సయ్య, రాజయ్య, లక్ష్మణ్, మురళి, వెంకయ్య, దామోదర్, సూర్యనారాయణ, హేమలత, వెంకటలక్ష్మి పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు.