Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

JNTU Hyderabad : ఇది మీకు తెలుసా, కిచెన్‌ వ్యర్థా లతో బయోగ్యాస్‌

JNTU Hyderabad : ప్రజా దీవెన, హైదరాబాద్‌: సంప్ర దాయేతర ఇంధన వనరుల విని యోగంపై జేఎన్‌టీయూ మరింత దృష్టి సారించింది. ఇప్పటికే సుల్తా న్‌పూర్‌ జేఎన్‌టీయూ కాలేజీలో సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు తో విద్యుత్‌ చార్జీలు గణనీయంగా ఆదా అవుతుండగా, త్వరలో హై దరాబాద్‌ క్యాంపస్‌లోని హాస్టళ్ల నుంచి వచ్చే కిచెన్‌ వ్యర్థాలతో బయోగ్యాస్‌ని ఉత్పత్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. ప్రస్తుతం వర్సిటీ ప్రాం గణంలో గౌతమి, కిన్నెర, మంజీరా, కమలానెహ్రూ వసతి గృహాలు ఉండగా, ఆయా హాస్టళ్ల నుంచి రోజుకు కనిష్టంగా 750నుంచి గరిష్టంగా 900క్వింటాళ్ల కిచెన్‌ వ్యర్థాలను మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. అయితే, ఆ వ్యర్థాలతో బయోగ్యాస్‌ ఉత్పత్తి చేస్తే గ్యాస్‌ ఖర్చులు ఆదా అవడమే కాకుండా యూనివర్సిటీకి గ్రీన్‌ ఎనర్జీ క్రెడిట్స్‌ కూడా లభిస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్‌ కాలేజీకి న్యాక్‌ అక్రిడిటేషన్‌, ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ల కోసం సమర్పించే దరఖాస్తులో గ్రీన్‌ ఎనర్జీ క్రెడిట్స్‌కు ప్రాధాన్యం ఉండడంతో ఆయా అక్రిడిటేషన్లు పొందేందుకు ఈ అంశం దోహదపడనుంది. గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించడంలో భాగంగా బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 50శాతం సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి.

అయితే, ప్రస్తుతం భారీ ప్లాంట్లకు మాత్రమే అందిస్తున్న ఈ సబ్సిడీని చిన్న, మధ్యతరహా ప్లాంట్లకు కూడా అందించాలనే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కిచెన్‌ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలతో బయోగ్యాసను ఉత్పత్తి చేయడంతో పాటు, చివరగా వచ్చే వ్యర్థాలను కూడా కంపోస్టు ఎరువుగా మార్చితే మరింత ఆదాయం సమకూరుతుందని బయోగ్యాస్‌ ప్రొడక్షన్‌ అంశంపై పరిశోధన చేసిన జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థి శ్రీనివాస్‌ తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వర్సిటీ ప్రాంగణంలో వెయ్యి కేజీల సామర్థ్యం కలిగిన ఎనరోబిక్‌ డైజేషన్‌ (బయోగ్యాస్‌ ప్లాంట్‌)ను ఏర్పాటు చేస్తే జేఎన్‌టీయూను జీరో వేస్టేజ్‌ క్యాంప్‌సగా మార్చవచ్చని పేర్కొన్నారు. యూనివర్సిటీ హాస్టళ్లలో కిచెన్‌ వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ ఉత్పత్తి చేస్తే ఏటా రూ.4.32లక్షలు ఆదా అవుతుందని ఉన్నతాధికారులు ఒక అంచనాకు వచ్చారు. వెయ్యి కేజీల వ్యర్థాల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ద్వారా రోజుకు 52కేజీల గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. సగటున రోజుకు 3 ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల వాడకానికి అయ్యే ఖర్చును రూ.3 వేల దాకా (సిలెండర్‌కు రూ.1,000చొప్పున) తగ్గించవచ్చు. నెలకు రూ.36వేలు ఆదా అవుతుండగా, ఏడాదికి రూ.4.32లక్షలు, ఐదేళ్లకు సుమారుగా రూ.22లక్షలు వ్యయాన్ని తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా వర్సిటీలో బయోగ్యాస్‌ ప్లాంట్‌(ఎనరోబిక్‌ డైజేషన్‌)ను ఏర్పాటు చేస్తే పరిశోధక విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆచార్యులు భావిస్తున్నారు.