Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Journalist Housing Society: కలెక్టర్ కలిసిన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:

Journalist Housing Society: నల్లగొండ జిల్లా (Nalgonda) కేంద్రంలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల (House places for journalists) కేటాయింపు విషయమై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkata Reddy) సూచన మేరకు నల్లగొండ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి (Collector Narayana Reddy)ని కలిసి చర్చించడం జరిగింది. సాధ్యమైనంత త్వరితగతిన హౌసింగ్ సొసైటీకి కేటాయించిన 6.16 ఎక రాల స్థలం విషయమై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం (Government) సిద్ధంగా ఉందని తెలిపారు. కలెక్టర్ కలిసిన వారిలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతి నిధులు ఫహిమోద్దీన్, జయశంకర్ గౌడ్, పులిమామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ తదితరులు ఉన్నారు.