Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kompalli Srikanth Reddy: టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా మహాసభను విజయవంతం చేయండి

— రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి

 

ప్రజా దీవెన, హైదరాబాద్:

 

Kompalli Srikanth Reddy: టీయూడబ్ల్యూజే రంగారెడ్డి (Rangareddy) జిల్లా రెండవ మహాసభ (Conference)ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి , కార్యదర్శి ప్రవీణ్ కుమార్ లు పిలుపు నిచ్చారు.ఈ నెల 11 మంగళవారం నాడు శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దటూరు శివారులోని ప్రగతి రిసార్ట్స్ లో నిర్వహిస్తున్న జిల్లా రెండవ మహాసభకు మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి ,మాజీ చైర్మన్ దేవు లపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు మాజీద్ , సత్యనారాయణ, నగునూరి శేఖర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ కార్యదర్శి రాంనారాయణలతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని వారు తెలిపారు.

జిల్లాలోని జర్నలిస్టులు అందరూ మహాసభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. జిల్లాలో 25 సంవత్సరాలకు పైగా విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టులకు ఈ మహాసభల సందర్భంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జర్నలిస్టులు హాజరు కావాలని వారు కోరారు.