శాలివాహన కుమ్మర సంఘం రాష్ట్ర నాయకులు శేషరాజు శ్రీనివాసులు
Leader Sesharaju Srinivas : ప్రజా దీవెన నాంపల్లి : ఫిబ్రవరి 24 బీసీ సంఘాల అభివృద్ధికి శాలివాహన సంఘం కోసం పాటుపడిన మల్లి కంటి పాపయ్య అనారోగ్యంతో మరణించడం పట్ల గట్టు నెమలిపురం గ్రామానికి తీరని లోటని శాలివాహన కుమ్మరి సంఘం రాష్ట్ర నాయకులు శేషరాజు శ్రీనివాసులు అన్నారు ఆయన ఆదివారం రోజున పాపయ్య కుటుంబాన్ని సందర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు పాపయ్య బీసీ సంఘాలను మరియు కుమ్మరి సంఘం అభివృద్ధికి అహర్నిశలు పనిచేశాడని తన గ్రామంలో ఉన్న యువకులను మంచిగా చదువుకోవాలని ప్రోత్సహిస్తూ తన కుమారుడు ఏడుకొండల్ ను ఉన్నత విద్యను చదివించి ఎస్ఐగా ఉమ్మడి జిల్లా సూర్యాపేటలో విధులు నిర్వహిస్తున్నాడని అన్నారు తల్లిదండ్రుల ప్రోత్సాహం యువకుల ఆసక్తి ఉంటే ఏదైనా సాధించగలరని పాపయ్య సేవలను కొనియాడారు పెద్దవూ ర.
పెద్ద అడిసర్లపల్లి గ్రామాలలో ప్రజా దీవెన ప్రతినిధితో కలిసి పర్యటించారు ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణన సర్వేలో తప్పులు జరిగినట్లయితే సంఘాల నాయకులు అధికారులకు సహకరించి తమ కులాలను రికార్డులలో సరిచూసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి బీసీ కుల సంఘాలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో శాలివాహన కుమ్మర సంఘం జిల్లా నాయకులు బొడ్డుపల్లి కనకయ్య సైదులు ఈదయ్య ఏరుకొండ శ్రీనివాస్ మండల శాలివాహన సంఘం నాయకులు కృష్ణ ఆరూరి వెంకన్న మల్లికంటి వెంకన్న మహిళ నాయకులు కడారు శృతి ,శేషరాజు సంధ్యారాణి కామిశెట్టి విజయలక్ష్మి పాల్గొన్నారు