Mahashivratri : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మరియు హుజూర్నగర్ నియోజకవర్గ భక్తులకు తెలియజేయునది మహా శివరాత్రి సందర్భంగా మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానానికి ఈ నెల 25,26,27 తేదీలలో కోదాడ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేయనున్నట్లు డిపో మేనేజర్ డి శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. కోదాడ నుండి మేళ్లచెరువు కు 20బస్సులు మరియు హుజూర్ నగర్ నుండి మేళ్ల చెరువు కు 10 బస్సులు తిరుగుతాయి.
ప్రతీ 10ని. లకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు.మహిళా ప్రయాణికులు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకొని ప్రయాణించవచ్చు. వివరాలకు 9959226302, 7780433533 కు సంప్రదించాలని కోరారు