Mandalappu Krishnakumari: ప్రజా దీవెన,కోదాడ: కోదాడ మాజీ జడ్పీటీసీ (Former ZPTC) మందలపు కృష్ణకుమారి (Mandalappu Krishnakumari) మృతి బాధాకరమని పలు పార్టీల నాయకులు అన్నారు. సోమవారం పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంతాప సభ (Mourning meeting)లో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు నియోజకవర్గ, టీపీసీసీ డెలిగేట్ సభ్యులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, మాజీ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, ఎర్నేని వెంకటరత్నం బాబు, వంగవీటి రామారావు, పారా సీతయ్య, ఆల్తాఫ్ హుస్సేన్, తుమాటి వరప్రసాద్ రెడ్డి, పందిరి నాగిరెడ్డి, మహబూబ్ జానీ, మాజీ ఎంపీపీలు జడ్పిటిసిలు పలువురు నాయకులు (Leaders) పాల్గొన్నారు.