Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MGU Kho Kho Team: ఎంజీయూ కోకో జట్టు ఎంపిక

ప్రజాదీవెన, నల్గొండ: తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న అంతర విశ్వవిద్యాలయ కోకో పోటీలకు ఎంజీయూ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డా హరీష్ కుమార్ తెలిపారు.

ఈనెల 27 నుంచి 31వరకు జరగనున్న ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు ఎంజీయూకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికల్లో ఎంజీయూ స్పోర్ట్స్ సెక్రటరీ డా హరీష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ డా మురళి, కోఆర్డినేటర్ డా శ్యాంసుందర్, పీడీలు డా వై శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.