— భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.
ప్రజా దీవెన, శాలిగౌరారం:
MP Chamala Kiran Kumar Reddy: ప్రజలు ఎల్లప్పుడూ కుల మతాలకు అతీతంగా, సుఖ సంతోషాలతో కలిసి జీవించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తన స్వగ్రామమైన నల్గొండ జిల్లా (Nalgonda District) శాలిగౌరారం (Saligauraram) కేంద్రంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఆయుధ, జమ్మి చెట్టు పూజలో పాల్గొని పూజలు చేశారు. ఎంపీగా గెలిచిన తరువాత మొదటిసారిగా దసరా ఉత్సవాలలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొనడంతో పాత మిత్రులు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.
శాలిగౌరారం మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి (Development) చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి విజయకుమార్, మాజీ తాజా మాజీ సర్పంచ్ బట్ట హరిత-వీరబాబు, మాజీ ఎంపీటీసీ జోగు సైదమ్మ శ్రీనివాస్, నాయకులు చింత ధనుంజయ, వడ్లకొండ పరమేష్,. చామల జైపాల్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు జమ్ము రమేష్, వివిధ పార్టీ నాయకులు గుజలాల్ శేఖర్ బాబు, బొడ్డు నగేష్, చిత్తలూరి జీడికల్లు, బండారు మహేష్, శ్రీ రాందాస్ రాజు, రాపాక రాజు, నిమ్మల సురేష్ తదితరులు పాల్గొన్నారు.