National Integrity Camp : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపూర్ లో ఎన్ ఎస్ ఎస్ లో భాగంగా జాతీయ సమైక్యతా శిబిరం (నేషనల్ ఇంటిగ్రిటి క్యాంప్) ను పూర్తి చేసుకొని వచ్చిన నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థి ఎం. నర్మదను మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఆల్వాల రవి అభినందించి ప్రశంస పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్లో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుంచి మొత్తం అయిదుగురు పాల్గొన్నారని ఎన్ జి కళాశాల నుంచి నర్మద ఒక్కరే పాల్గొనడం అభినందనీయమని అన్నారు.
ఈ క్యాంపులో ఎయిడ్స్ అవాగాహనాతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో నర్మద పాల్గొన్నట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. నర్మదను అభినందించిన వారిలో మహాత్మ గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి మద్దిలేటి ఎన్ జి కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం సావిత్రి కంబాలపల్లి శివరాణి ఎం వెంకటరెడ్డి వాలంటీర్స్ ఉన్నారు.