* బీసీ కులాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి పగడాల ఎల్లన్న
మునుగోడు ప్రజా దీవెన (అక్టోబర్ 11)
Pagadala Ellanna: ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేది సద్దుల బతుకమ్మ పండుగ (Saddula Bathukamma festival) రాష్ట్ర ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని బీసీ కులాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి పగడాల ఎల్లన్న (Pagadala Ellanna) అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని దేవాలయం వద్ద మహిళలు ఆనందంగా నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ పండుగను తిలకించారు.
అనంతరం ప్రజా దీవెనతో ముచ్చటిస్తూ తెలంగాణ ఆచార సంప్రదాయాలకు ప్రతీక మన ఆడబిడ్డల ఆత్మగౌరభాన్ని చాటి పూల వేడుకగా భావిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మర్రిగూడ మండల మహిళల (Women of Marriguda Mandal)కు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాలివాహన కుమ్మరి సంఘం మండల శాఖ నాయకులు బిక్షం కాసర్ల అంజయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.