Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pranay Murder Case: బిగ్ బ్రేకింగ్, ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు

–A2 నిందితుడు సుభాష్ కు ఉరి శిక్ష, మిగతా వారికి జీవితఖైదు

 

–కీలక తీర్పు విలువరించిన నల్ల గొండ న్యాయస్థానం

 

ప్రజా దీవెన, నల్లగొండ:

 

Pranay Murder Case: దేశంలోనే సంచలనం సృష్టించిన తెలంగాణలోని పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసు తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమృ త తండ్రి ఆత్మహత్యకు పాల్పడగా, రెండో ప్రధాన నిందితుడు A2 సుభాష్ వర్మ కు ఉరి శిక్ష విధిస్తూ మిగిలిన వారికి జీవిత కైదిస్తూ నల్ల గొండ న్యాయస్థానం సంచలన తీ ర్పు విలువరించింది. ఇదిలా ఉండగా ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కూడా కోర్టు తీర్పు చెప్పింది.

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఉత్కంఠభరితం నెలకొన్న ఈ సంచలన కేసులో న్యాయస్థానంలో విచారణ తుది దశకు చేరుకొగా సోమవారం నల్గొండ జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలి సిందే. ప్రధానంగా దేశంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచ లనం సృష్టించిన నల్గొండ జిల్లా మి ర్యాలగూడకు చెందిన పెరు మాళ్ల ప్రణయ్ హత్యకేసులో తుది తీర్పును ఈ రోజు సోమవారం నల్గొండ రెండో అదనపు సెషన్స్ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు వెల్లడించింది.

ఈ కేసు కథకమిషూ ఇలా ఉంది. హ తుడు ప్రణయ్ 201 8 సెప్టెంబర్ 14న హత్యకు గురయ్యాడు. గర్భ వతిగా ఉన్న భార్య అమృ తను నల్లగొండ జిల్లా మిర్యా లగూడలో ని ఆస్పత్రికి తీసుకువెళ్లి తిరిగి వ స్తుండగా దుండగులు ప్రణయ్‌పై కత్తులతో దాడి చేసి హత మార్చారు. తన కూతురిని కులాం తర వివాహం చేసుకున్నాడనే కక్ష తో సుఫారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను మా రుతీరావు హత్య చేయించా డు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాల స్వామి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.

ఈ కేసులో మారుతి రావుతో సహా మొత్తం ఎనిమిది నిందితులపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ నడుస్తుం డగానే ఆత్మహత్యకు ఏ1 నిందితు డు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రణయ్‌ తండ్రి పెరు మాళ్ల బాలస్వామి, తల్లి ప్రేమలత, భార్య అమృతవర్షిణి నుంచి వివరా లను కోర్టు నమోదు చేసుకుంది. తుది తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూ స్తు న్న క్రమంలో కోర్టు వెలువరించిన తీర్పుతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

 

*వివిధ మార్గాల్లో సమగ్ర విచా రణ…* నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం సాక్షు ల విచారణను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా రోజువారీగా 1 02 మందిని విచారించింది. కోర్టు ఇప్పటికే ప్రణయ్‌ కుటుంబ సభ్యు ల వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ హ త్యకేసు విచారణ తుది దశకు చే రుకుంది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుసుకుందన్న నె పం తో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్యచేయిం చాడు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600 పేజీల్లో చార్జిషీట్‌ నివేదికను రూ పొందించింది. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో విచారణ పూర్తిచేసి హత్యకేసుల్లో ఎనిమిది నిందితుల పాత్ర ఉందని నిర్ధారిం చింది. 2019 జూన్‌ 12న చార్జిషీట్‌ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ ప్రారంభించిం ది. సుమారు 5సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా, పోలీస్‌ శాఖ సమర్పించిన చార్జిషీట్‌ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ల తో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈ రోజుకు రిజర్వు చేసింది.

 

అయితే ప్రణయ్‌ హత్య కేసులో ఏ1 తిరునగరు మారుతీరావు, ఏ2 బీహార్‌ కు చెందిన సుభాష్‌శర్మ, ఏ3 అజ్గర్‌ అలీ, ఏ4 అబ్ధుల్‌బారీ, ఏ 5 ఎం.ఏ కరీం, ఏ 6 తిరునగరు శ్రవణ్‌కు మార్‌, ఏ 7 శివ, ఏ 8 నిజాం నింది తులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో నిందితులుగా పేర్కొన్నారు.

ప్రధాన నిందితుడు మారుతీరావు(ఏ-1) 2020 మార్చి లో ఆత్మహత్యకు పాల్పడ్డా డు. ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యా ధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు అమలు చేసింది. సుభాష్‌శర్మ (ఏ-2), అస్గర్‌అలీ (ఏ -3) విచారణ ఖైదీలు గా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు.