Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Raid On Pub: టాస్‌ పబ్బుపై దాడులు.. పోలీసుల అదుపులో 142 మంది..

అశ్లీల నృత్యాలు చేస్తున్నారంటూ ఆరోపణలు

Raid On Pub: ప్రజాదీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ (Banjara Hills)లోని టాస్‌ పబ్బు (TOS pub)పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్దంగా యువతులతో నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు. పబ్‌కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు యువతులతో అసభ్యకరమైన నృత్యాలు (Indecent dances with young women) చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడుల సమయంలో పబ్‌లో ఉన్న 100 మంది యువకులను, 42 మంది యువతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

టాస్ పబ్​పై టాస్క్​ఫోర్స్ దాడి

ఈ యువతులు పబ్‌కు వచ్చే వారితో చనువుగా ఉంటూ మద్యం (Alcohol) సేవిస్తున్నట్లు నటించి, శీతల పానియాలు (Cool drinks) తాగి, కస్టమర్లతో మద్యం తాగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా కస్టమర్​తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఉన్నట్లు తెలిపారు. ఇందులో 10 మంది యువతులు గతంలో ఊర్వశి బార్ (Urvashi Bar), ఆఫ్టర్ 9 పబ్​ (After 9 pub)లో పట్టుబడిన వాళ్లుగా గుర్తించామని, రిపీటెడ్​గా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి (ACP Venkat Reddy) తెలిపారు. వీళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పబ్​ను సీజ్ చేస్తామని వివరించారు. ఎక్సైజ్ అధికారులకు కూడా రిపోర్ట్ పంపిస్తామన్న ఆయన, పబ్ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, ఆరిఫ్, శ్రావణ్ గౌడ్, డీజే ప్లేయర్ ఆసిఫ్​లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే..

బంజారాహిల్స్​లోని టాస్ పబ్​లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో టాస్క్​ఫోర్స్ టీమ్​తో కలిసి రైడ్ (Taskforce team raid) చేశాం. టాస్ పబ్​లో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులను అదుపులోకి తీసుకున్నాం. ఉద్యోగాల పేరుతో యువతులను ట్రాప్ చేసింది పబ్ యాజమాన్యం. ప్రతీ వీక్ ఎండ్​లో పబ్​కు రావాలని యువతులకు సూచించారు. కస్టమర్లతో చనువుగా ఉంటూ, బిల్ ఎక్కువ చేయించడం యువతుల టార్గెట్. కస్టమర్​తో ఎక్కువ బిల్ చేయించిన యువతికి కమీషన్ ఇస్తారు. మొత్తం 42 మంది యువతులు, 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నాం.

– వెంకట్ రెడ్డి, బంజారాహిల్స్ ఏసీపీ