Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 5:23 pm Posted by : prajadeveena.com

Ramu Naik Suspended Over Land Scam: డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెండ్

Ramu Naik Suspended Over Land Scam: తెలంగాణ రెవెన్యూ శాఖ(Revenue Department)లో సంచలనం రేపిన భూ అక్రమాల వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్‌ (Deputy Collector Ramu Naik)పై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పలు భూముల అక్రమ బదిలీలు, వివాదాస్పద రిజిస్ట్రేషన్లకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) వెల్లడించారు.

హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల స్థలాల(indiarama house lands) పరిశీలన సందర్భంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. హైకోర్టు సమీపంలో ఉన్న విలువైన హౌసింగ్ బోర్డు భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఒకరి పేరిట రిజిస్ట్రేషన్ చేసిన అంశం విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంలో అప్పటి సబ్ రిజిస్ట్రార్ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

2013 నుంచి 2018 మధ్య కాలంలో హౌసింగ్ బోర్డు(Housing Board)లో భూసేకరణ అధికారిగా పనిచేసిన సమయంలో రాము నాయక్ పలు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు ప్రభుత్వం తెలిపింది. విజయ్‌నగర్ కాలనీ, లక్ష్మిగూడ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల బదిలీలకు సంబంధించిన పలు కేసులు గత కొన్నేళ్లుగా నమోదై ఉన్నట్లు వెల్లడించింది.

Telangana government takes disciplinary action against Deputy Collector Ramu Naik amid allegations of illegal land registrations and government land transfers

Also Read:Lokesh Mourns Vizag Steel Tragedy: విశాఖ స్టీల్ ప్రమాదం.. లోకేష్ దిగ్భ్రాంతి

ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఇతర అధికారులపై కూడా చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమాలకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపరింటెండెంట్ వివేకానంద్‌ను ఉద్యోగం నుంచి తొలగించగా, మరో అధికారి బోనా నాయక్‌ను సస్పెండ్ చేశారు.

ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజా ఆస్తులపై అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, విచారణ పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.