Revanth Reddy: ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హస్తిన పర్యటన అకస్మాత్తుగా రద్దయ్యింది. ఆయనతో సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు శనివారం రాత్రికే ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన రద్దయింది. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడంతో పర్యటన రద్దు అయినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డిలతో ఇవ్వాళ ఉదయం కె.సి. వేణుగోపాల్ చరవ మాట్లాడ నున్నారు. నేటి ఉదయం 11 గం టలకు ఫోన్ కాల్ లో చర్చలు జరు గనున్నాయి. ఈ నెల 10న ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నా మినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాను న్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జా బితా ఖరారు చేసే అవకాశం ఉం దని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే పార్టీలో పలువురు సీని యర్ నేతల తో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నట రాజన్, టీపీ సీసీ చీఫ్ మహేశ్ కుమార్ చర్చలు జరిపా రు.ఎవరెవరికి ఏ పదవులు కావా లో వారినే అడిగి తెలుసుకు న్నా రు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలి సిందే.