Rice buying centres: నల్లగొండ జిల్లాలో గుర్తించిన 325 ధాన్యం కొనుగోలు కేంద్రాల (Rice buying centres)ను ఎట్టి పరిస్థితులలో సోమవారం సాయంత్రం వరకు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ( collector J.Srinivas) ఆర్డీవోలు, తహసిల్దార్లను ఆదేశించారు. ఆదివారం ఆయన దాన్యం కొనుగోలు కేంద్రాల విషయమై జిల్లాలోని ఆర్డీవోలు, తహసిల్దార్లు, పౌరసరఫ రాలు,వ్యవసాయ, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వానకాలం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నల్గొండ జిల్లా (Nalgonda)లో (375) ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని లక్ష్యం గా నిర్ణయించడం జరిగిందని, అయితే మొదటి విడుతన (325) కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేసి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, గతంలో నిర్దేశించిన మేరకు సోమవారం లోగా సాయంత్రం లోగా (325) కు (325 ) ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితులలో ప్రారంభించాలని ఆదేశించారు.
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగులతో పాటు, అవసరమైన టార్పాలిన్లు (4) తూకం కొలిచే యంత్రాలు, (2) తేమ కొలిచే యంత్రాలు, రైతులు వేచి ఉండేందుకు టెంట్, కుర్చీలు, తాగునీరు ,విద్యుత్ సరఫరా వంటి అన్ని సౌకర్యాలు (Facilities) ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ విషయంలో ఆర్డీవోలు, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ ప్రత్యకించి చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఆది వారం నాటికి అన్ని మండల కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేం ద్రాలు పూర్తి కావాలని, సోమవారం సాయంత్రం లోపు అన్ని చోట్ల ధాన్యం కొను గోలు కేంద్రాలతో పాటు, కొనుగోళ్లు సైతం ప్రారంభించాలని చెప్పారు.
రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదివరకే నల్గొండ సమీపంలోని ఆర్జాల వావి వద్ద ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ఆర్జాల బావి కోనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకే (100) మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని (Rice) కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. డిఎస్ఓ వెంక టేశ్వర్లు, ఆర్డిఓలు,తహశీల్దార్లు, డిపిఎంలు,ఏపిఎంలు, సహకారశాఖ అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్లు, మార్కెటింగ్, వ్యవసాయ తదితర శాఖల అధికారులు ఈ టెలికాన్ఫరేన్స్‌కు హాజరయ్యారు.