RTC Employees : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టీజీ ఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏను ప్రకటించారు. 2.5 శాతం డి ఏ వల్ల ఆర్టీసీ పై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్ర యాణం చేశారని, దాదాపు 5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహి ళలు ఉచితంగా ప్రయాణించారని చెప్పారు. మహా లక్ష్మి పథకం ప్రా రంభం తరువాత మహిళా ప్రయా ణికుల సంఖ్య దాదాపు ప్రతి రోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్ర యాణం చేస్తున్నారన్నారు. దీని వ ల్ల పనిభారం పెరిగినా ఆర్టీసీ ఉద్యో గులు ఓపికతో పనిచేస్తున్నారని ప్ర శంసించారు.
మహిళా సమాఖ్యల నుంచి అద్దెకు 150 బస్సులు…. టీజీ ఎస్ ఆర్టీసీ మహిళా సమాఖ్యల నుంచి 150 బస్సులను అద్దె ప్రాతి పదికన తీసుకోనుంది. ఈ కార్యక్ర మానికి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నా రు. రాష్ట్రంలో కోటి మంది మహి ళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ మహాయజ్ఞానికి శ్రీకా రం చుట్టబోతున్నామని మంత్రి పొ న్నం వెల్లడించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసా రి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టీ బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలం గాణ ప్రభుత్వం విజయం సాధిం చిందని చెప్పారు. రేపటి మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘా ల ద్వారా ఆర్టీసీ తో అద్దె ప్రాతిపది కన ఒప్పందం జరగగా రేపు మొద టి దశలో 150 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క లాంఛ నంగా ప్రారంభించనున్నారు. ఇంది రా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మం డలానికి ఒక మండల మహిళా స మైక్య సంఘం ద్వారా ఒక బస్సు రేపు ప్రారంభం కానుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు పాత ఉమ్మడి జిల్లాలైన వ రంగల్, ఖమ్మం,కరీంనగర్, మహ బూబ్ నగర్ జిల్లాలను పైలెట్ ప్రా జెక్టు గా ఎంపిక చేసి మహిళా సం ఘాలను భాగస్వామ్యం చేశారు.