SC Classification : ప్రజా దీవెన శాలిగౌరారం : ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ లో సంపూర్ణమైన ఎస్సీ వర్గీకరణ చట్టం తక్షణమే తీసుకరావాలని ఎమ్మార్పీఎస్ శాలిగౌరారం మండల ఇంచార్జీ కారుపాటి అంబేద్కర్ మాదిగ డిమాండ్ చేశారు.
శాలిగౌరారం మండల కేంద్రంలో ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక నిరసన నిరాహార దీక్షలు నేటితో నాల్గవ రోజుకు చేరుకున్నాయి.
ఈ దీక్షకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ ఇంచార్జీ కారుపాటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సి వర్గీకరణ చేయడం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత అని, మాదిగల వల్ల రేవంత్ రెడ్డి రాజకీయంగా లాభపడ్డాడని జడ్పీటీసీ నుండి ముఖ్యమంత్రి వరకు ఎదిగారని,కానీ రేవంత్ రెడ్డి వలన మాదిగలకు ఒరిగింది ఏమి లేదన్నారు. తన సీటును కాపాడుకోవడం కోసం మాలల ఒత్తిడికి తలొగ్గి ఇచ్చిన మాటను తప్పి దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా రేవంత్ రెడ్డి నిలిచిపోయాడని గుర్తు చేశారు
ఈ దీక్షలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బట్ట శ్రీనివాస్ , బట్ట సైదులు,బాకీ వెంకన్న, మొలుగూరి సోమయ్య, వేముల శ్రీకాంత్,కోక యాదయ్య,బట్ట రఘు, దేవరకొండ మస్తాన్, తోటకూరి సతీష్, బట్ట తిరుమలేష్, మాచర్ల కళ్యాణ్, చింతల సతీష్ మాచర్ల వెంకన్న బట్ట బిక్షం, దేవరకొండ లక్ష్మణ్, దేవరకొండ సైదులు మాదిగలు తదితరులు పాల్గొన్నారు.