SC Reservations : ప్రజా దీవన శాలిగౌరారం : మండల కేంద్రంలోని డా.బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ శాలిగౌరారం మండల కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా కో-ఆర్డినేటర్
బోడ సునీల్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణమాదిగ నాయకత్వంలో మాదిగ, మాదిగ 58 ఉపకులాలకు విద్యార్థులకు విద్య,ఉద్యోగ, ఆర్థిక,రాజకీయ,సంక్షేమ పథకాలలో జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలని 1994 నుంచి గత 30సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమంలో మొదటి సారి 1999లో ఎస్సీ వర్గీకరణ జరిగి మాదిగలకు దాదాపు 22000 ఉద్యోగాలు రావడానికి అమరవీరుల అత్యగం ముఖ్య పాత్ర పోషించి తమ ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళ కృషి వెలకట్టలేనిదనీ ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే వర్గీకరణ కోసం మాదిగలు గాంధీ భవన్ ఎదుట బలిదానం చేసుకొన్నారు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ శాస్త్రీయంగా జరిగితేనే మాదిగ అమరులకు ఘన నివాళి అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవాలని డిమాండ్ చేశారు.
లక్ష డప్పులు వెల గొంతుల మాదిగల సాంస్కృతిక ప్రదర్శన వుంటుందని మాదిగలు అందుకు సిద్దం కావాలని అన్నారు… ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఎమ్మార్పిఎస్ మండల ఇంచార్జీ కారుపాటి అంబేద్కర్ మాదిగ వహించారు ఎమ్మార్పిఎస్ మండల నాయకులు బట్ట సైదులు,బట్ట శ్రీను, బాకీ వెంకటయ్య, గద్దపాటి అరవింద్, కళా మండలి అధ్యక్షులు వేముల నాగరాజు, బట్ట లక్ష్మణ్,పనికెర రమేష్, వేముల వెంకన్న,ఆకారం గ్రామ అధ్యక్షులు బొడ్డు నాగరాజు, అడ్లూర్ గ్రామ అధ్యక్షులు మాచర్ల ప్రతాప్,సాయి, అజయ్, నాగరాజు,బిక్ష్మం తదితరులు పాల్గొన్నారు.