Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TPUS Dharamgarha Poster: తపస్ ధర్మాగ్రహ పోస్టర్ విడుదల

ప్రజాదీవెన, నల్గొండ టౌన్: ఈనెల 17న హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన తపస్ ధర్మాగ్రహ దీక్ష పోస్టర్ను స్థానిక తపస్ కార్యాలయం నల్లగొండలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అలుగుపల్లి పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షులు ఇరుగు శ్రీరామ్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు పెండింగ్ బిల్లులు నాలుగు డిఏలు, పిఆర్సి తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద ధర్మా గ్రహ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్, జిల్లా కోశాధికారి నంద్యాల రెడ్డి, రేణికుంట్ల రాజశేఖర్ ,చక్రధర్, వెంకట్ రెడ్డి ,పిండి వెంకట్ రెడ్డి, ప్రసాద్ ,కిషన్ ప్రసాద్, కే శ్రీనివాస్,వెంకటేష్ మల్లేష్ ,తదితరులు పాల్గొన్నారు.