Tejaswini Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: అంతర్ రాష్ట్ర తెలంగాణ (Telangana) జిల్లాల వెయిట్ లిఫ్ట్ ఛాంపియన్ (Weight lift champion)గా కందుల తేజస్విని గౌడ్ (Kandula Tejaswini Goud) విజయం సాధించారు. డబ్ల్యుపిసి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్ – 2024 ఆధ్వర్యంలో నిర్వహించిన వెయిట్ లిఫ్ట్ పోటీల్లో గెలుపొంది మొదటి స్థానంలో నిలిచింది. వెయిట్ లిఫ్ట్ 120 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. వెయిట్ లిఫ్ట్ 120 కేజీల విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన తేజస్వినికి డబ్ల్యుపిసి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్ – 2024 రాష్ట అధ్యక్షురాలు ఇంతూరి రేణుక మెడల్ తో పాటు దృవీకరణ పత్రం అందజేసి అభినందించారు. తేజస్విని వెయిట్ లిఫ్ట్ పోటీల్లో విజయం సాధించడం పట్ల ఆమె బంధు మిత్రులు కందుల వెంకటరమణ, సీనియర్ జర్నలిస్టు గుండగోని జయశంకర్ గౌడ్ అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.