Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 1:30 pm Posted by : prajadeveena.com

Telangana Anganwadi Breakfast Scheme: అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం.. ఈ నెల 12 నుంచి ప్రారంభం

Telangana Anganwadi Breakfast Scheme: తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మరింత మెరుగైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12వ తేదీ నుంచి అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి దశలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు.

ఈ పథకం కింద అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరయ్యే పిల్లలకు ప్రతిరోజూ ఉదయం ఉప్మా లేదా కిచిడీతో పాటు పాలు అందించనున్నారు. చిన్న వయస్సులోనే పిల్లలకు అవసరమైన పోషకాహారం అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.

Also Read:Brs Talasani Srinivas Yadav: మాజీ మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్య, కాంగ్రెస్ అంటే నే అబద్ధాల చరిత్ర

రాష్ట్రంలో కొంతమంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌వాడీ స్థాయిలోనే పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, వారి ఎదుగుదలకు అవసరమైన పోషక విలువలు (Nutrition food) అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది.

అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాల (Telangana Anganwadi Centres) సెలవులను జూన్ 10 లేదా 12 వరకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సెలవుల పొడిగింపుపై తుది నిర్ణయం ఆధారంగా బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభ తేదీలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.